Publish Date:Feb 24, 2026
వాణిజ్య ఒప్పందాలతో ఆటలాడాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అలాంటి దేశాలపై ప్రస్తుతం అంగీకరించిన దానికంటే చాలా ఎక్కువ టారిఫ్‌లు, లైసెన్స్ ఫీజులు విధిస్తామని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. టారిఫ్‌ల విధింపుపై ట్రంప్‌కు ఉన్న విశేష అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇటీవల ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ వెంటనే మరో మార్గాన్ని ఎంచుకున్నారు. 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను అస్త్రంగా వాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం తాత్కాలిక సుంకాన్ని ప్రకటించారు. ఇది 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ కొత్త టారిఫ్ మంగళవారం (ఫిబ్రవరి 24)నుంచి అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పద తీర్పుతో ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తేవారు ఊహించనంత ఎక్కువ టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు జాగ్రత్త!" అని ట్రంప్ తన పోస్ట్‌లో హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ఓటింగ్‌ను యూరోపియన్ పార్లమెంట్ వాయిదా వేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-warn-world-countries-on-tariffs-36-214600.html
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.