ట్రంప్‌ విజయంపై భయపడుతున్న అమెరికన్లు..

Publish Date:Nov 11, 2016

Advertisement

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయం ఆ దేశంలో ఒకవైపు సంబరాలు జరుపుకుంటుండగా అదే రేంజ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త అధినేత వస్తుంటే నిరససలు జరగడం బహుశా అమెరికా చరిత్రలో ఇదే ప్రథమమేమో. ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ నిన్న పెద్ద సంఖ్యలో జనం రోడ్లమీదకు చేరారు. ట్రంప్ వ్యతిరేక బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన మాకు అధ్యక్షుడు కాదు..దేశంలో విద్వేషానికి చోటు లేదు అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఐటీ కేంద్రం సిలికాన్ వ్యాలీ వాసులు ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నా జీవితంలో జరిగిన చెడు సంఘటనగా భావిస్తున్నా.. అయితే దీన్ని అంగీకరించకతప్పదు. పరిస్థితులు ఇదివరకటిలాగే ఉంటాయనుకోవడం లేదని ఒక సంస్థ యజమాని ట్వీట్ చేశారు. బహుశా హిట్లర్ అధికారం తీసుకున్నపుడు ప్రజలు ఇలాగే అనుకున్నారా అని మరోకరు ట్వీట్ చేశారు. ఇంకొందరైతే ఏకంగా కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా నుంచి విడిపోతే మంచిదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

 

అసలు ట్రంప్ అధ్యక్షుడైనందుకు జనం ఇంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది ఆయన నోటి దురుసు వల్లే వచ్చిందనుకోవాలి. దూకుడు, నోటి దురద, జాత్యాహంకార వాగుడు, విద్వేష ప్రచారం, ప్రత్యర్థులను దుమ్మెత్తి పోసే ధోరణితో డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పదంగా మారారు. ప్రచారంలో భాగంగా రోజుకో సంచలన ప్రకటనతో దూసుకుపోయారు. ఈ నెగటివ్ అంశాలనే పదేపదే చూపుతూ మీడియా హోరెత్తించింది. దానికి తోడు వలసవాదుల విషయంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడి స్ధానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి కంపెనీలు చైనా, భారత్, మెక్సికో దేశాలకు చెందినవారిని హెచ్1బీ1 వీసాల ద్వారా అమెరికాకు పిలుపించుకుని తక్కువ వేతనానికి నియమించుకుని పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. హెచ్1బీ1 వీసాలు స్థానిక ఉద్యోగులకు గండికొడుతున్నాయని ఆయన పలు సభల్లో బహిరంగంగానే విమర్శించారు.

 

అందుకే సిలికాన్ వ్యాలీలో మొదటి నుంచి ఆయనపై సానుకూల స్పందన లేదు. సిలికాన్ వ్యాలీలోని కంపెలనీ అధిపతులకు, అక్కడి టెక్కీలకు మా మొదటి ఛాయిస్ ట్రంప్ కాదని ముందే ప్రకటించేశారు. సాంకేతిక నిపుణులు అమెరికాలోకి వలస రావడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని..కానీ ఇక్కడ పనులు జరగాలంటే భారత్, చైనా లాంటి దేశాల నుంచి నిపుణులైన టెకీలు కావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. వలసలపై నిషేధం విధిస్తే ఇక్కడ లాభాల మాట దేవుడెరుగు కంపెనీలు నడవటమే గగనమంటున్నారు. అందుకే ట్రంప్‌ను పేరుపెట్టి విమర్శించకపోయినా, ఆయన వలస విధానాలను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఐటీ పరిశ్రమ మొత్తం హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ట్రంప్‌కు ఇచ్చిన దానికంటే 114 రెట్లు అధికంగా హిల్లరీకి విరాళాలు అందజేసింది.  

 

సిలికాన్ వ్యాలీ అంటే వ్యాపార అవసరాలు అనుకోవచ్చు కానీ మిగిలిన రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రజలపైనా ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ముస్లింలకు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సెక్యులరిజం గురించి మాట్లాడేవారు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన అధ్యక్షుడైతే తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని చాలా మంది ఆందోళన చెందారు. ఈ అంశాలను బేరీజు వేసుకున్న మీడియా సహా మిగిలిన సంస్థలు వెలువరించిన సర్వేల్లో హిల్లరీనే అదృష్టం వరిస్తుందని ప్రకటించారు. చివరకు పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఐటీ పరిశ్రమ వర్గాలన్నీ హిల్లరీ గెలుస్తారనన్న అభిప్రాయంతోనే ఉన్నాయి. అధ్యక్షురాలైతే ఆమె ముందుగా ఏం చేస్తారా అన్న దానిపై చర్చించుకుంటున్నాయి.

 

 కానీ సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ..అనూహ్యంగా ట్రంప్ అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా ఎన్నికై..అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఫలితాలతో షాక్ తిన్న సిలికాన్ వ్యాలీ సహా దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ట్రంప్‌ను అధ్యక్షుడిగా జీర్ణించుకోలేక రోడ్ల మీదకు వచ్చారు. అవునన్నా కాదన్నా ట్రంప్ ఇప్పుడు అమెరికా అధినేత..ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితాన్ని మార్చలేమన్న సంగతి అక్కడి ప్రజలు తెలుసుకోవాలి. గెలవాలనే తలంపుతోనే ట్రంప్ ప్రచారంలో నోరు జారారా..? లేదంటే తన మనసులో ఉన్న మాటనే చెప్పారా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.