ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్.. అలాంటిదేం లేదన్న ఇరాన్!

Publish Date:Jun 11, 2026

Advertisement

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించే దిశగా   సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య  సాగుతున్న  యుద్ధ వాతావరణాన్ని ముగింపుకు తెస్తూ  శాంతి ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై జరప తలపెట్టిన అమెరికా దళాల భారీ సైనిక దాడుల ప్రణాళికను కూడా తక్షణమే రద్దు చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  తన ట్రూత్ సోషల్  ద్వారా కూడా  ఈ విషయాన్ని ట్రంప్ షేర్ చేశారు.  ఇరాన్‌తో యుద్ధాన్ని నివారించడానికి ఇదో గొప్ప పరిష్కారమనిపేర్కొన్నారు.  

అయితే ట్రంప్  ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం  కొట్టిపారేసింది. అమెరికా చేస్తున్న వాదనలు చాలా తొందరపాటు చర్యలని.. తుది ఒప్పందంపై  తాము ఇంకా ఎ అధికారిక ఆమోదం తెలుపలేదని కుండబద్దలు కొట్టింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అనుబంధ సంస్థ   ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ప్రాథమిక అవగాహన ఒప్పందానికి సంబంధించిన ఏ ఒక్క పత్రంపైనా ఇరాన్ సంతకం చేయలేదు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ .. ఒప్పందంలోని చాలా భాగాలు చర్చల ద్వారా ఖరారైన మాట వాస్తవమే అయినా..  అమెరికా పదేపదే తన వైఖరిని మారుస్తోందని, అందుకే తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. వాషింగ్టన్ కనుక తమ ప్రతిపాదనలను పూర్తిగా అంగీకరిస్తేనే ఇరాన్ ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తుందని ఇరాన్ ప్రభుత్వ మీడియా  పేర్కొంది. 

అదలా ఉంటే అగ్రరాజ్యాధినేత ట్రంప్ ప్రకారం.. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ వంటి పలు గల్ఫ్  దేశాలు ఈ శాంతి ముసాయిదా ఒప్పందానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. ఈ వారాంతంలోనే యూరప్‌లో అధికారిక సంతకాల ప్రక్రియ పూర్తవుతుంది.

తద్వారా ఘర్షణల కారణంగా మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తారు. అలాగే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోనని ఈ ఒప్పందానికి  కట్టుబడి ఉంటుంది.  అయితే బుధవారం టెహ్రాన్‌లో జరిగిన చర్చల్లో ఒక సూత్రప్రాయ అంగీకారం కుదిరినప్పటికీ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుండి ఇంకా తుది ఆమోదం  రావలసి ఉందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా తన నౌకాదళంతో ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తుండగా, ఇరాన్ మాత్రం తమపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల పూర్తి ఉపసంహరకు పట్టుబడుతోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇరు దేశాల మధ్య  నెలకొని ఉన్న విశ్వాసరాహిత్యాన్ని చాటుతున్నాయి.  

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ పోరు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.