ట్రంప్ దూకుడు.. ప్రమాదంలో అమెరికా అగ్రరాజ్య హోదా?!

Publish Date:Jan 29, 2025

Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జన్మతహ పౌరసత్వం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, హెచ్1బి వీసాల విషయంలో అమలు చేస్తున్న ఆంక్షలు కానీ, ఇంకెంత మాత్రం ఇతర దేశాల నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వద్దామనుకునే వాళ్లను ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులు ఆదాయపన్ను చెల్లించనవసరం లేదనీ, వారి ఆదాయపన్ను రద్దు చేస్తున్నాననీ ప్రకటించారు. అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గమే.. ఇతర దేశాలు అనివార్యంగా అమెరికాకు దూరం జరగక తప్పని పరిస్థితిలోకి వాటిని నెట్టేస్తున్నది. ఇంతకీ ఆ అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేసి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటంటే ఇతర దేశాలపై భారీగా సుంకం వసూలు చేయాలని.  అమెరికా అలా అధిక సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకున్న దేశాలలో ప్రధానంగా చైనా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి. 

భారత్ పట్ల ఆయన అక్కసు గతం నుంచీ తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి ఇంకా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే ట్రంప్  భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. అమెరికా దిగుమతులపై భారత్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందంటూ ఆయన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.   విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేయడం ద్వారా అమెరికా దేశస్థులను సంపన్నులుగా చేయడమే తన లక్ష్యంగా ట్రంప్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు.   ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయులు తీవ్రంగా నష్టపోతారు.  విదేశీయులపై కూడా సుంకం పెంచడమంటే అమెరికా లోని ఎన్నారైలు కూడా రిస్కు లో పడినట్లే. 

ఇక ట్రంప్ నిర్ణయాలు చదువు కోసం అమెరికా వెళ్లిన, వెళ్లాలనకుంటున్న భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేస్తే తమను అక్రమ వలసదారులంటూ దేశం నుంచి పంపించేస్తారని భయపడుతున్నారు.  చదువుకోసం వెళ్లినవారు చదువు పూర్తికాగానే స్వదేశా లకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ లు చేయడం నిబంధనలకు వ్యతిరేకమంటూ వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక యూరోపియన్ దేశాలపైనా ట్రంప్ తన ప్రతాపం చూపుతున్నారు. డాలర్ ను కాదని యూరో కరెన్సీ అనే దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇక చైనాకు అయితే గట్టి ఝలకే ఇచ్చారు.   ట్రంప్ దూకుడు అమెరికాకు మేలు చేస్తుందా? నష్టం చేకూరుస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ నిర్వాకం వల్ల తొందరలోనే అమెరికా అగ్రరాజ్యం హోదా కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.