భార‌త్ పై 25 శాతం సుంకాల మోత‌.. ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం?

Publish Date:Aug 1, 2025

Advertisement

ట్రంప్ భారత్ అంటేనే మండి ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మోడీ అంటేనే ఆయ‌న‌కు అస్స‌లు గిట్ట‌డ్డం లేదు. ఒక స‌మ‌యంలో ట్రంప్ విజయం కోసం ప్ర‌చారం చేసిన మోడీ.. ట్రంప్ రెండో సారి గెలిచాక త‌న త‌ప్పిపోయిన సొంత సోద‌రుడ్ని క‌లిసినంత సంబ‌రంగా ఫీలయ్యారు. అయినా కూడా మోడీ  పొడ ట్రంప్ కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.  ఏమైందో తెలీదుగానీ..  భారత్ పై పాతిక శాతం టారీఫ్ ల‌తో విరుచుకుప‌డ్డం మాత్ర‌మే కాదు.. భార‌తీయులంటేనే ఉద్యోగాలివ్వ‌ద‌ని అంటున్నారు ట్రంప్.

పాకిస్థాన్ లో ప్ర‌స్తుతం పెట్రోలు త‌వ్వ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టింది అమెరికా.  వ‌చ్చే రోజుల్లో భార‌త్ కే ఇంధ‌నం అమ్మొచ్చ‌ని అంటారు ట్రంప్. మోడీ పాకిస్థాన్ పాల‌సీని ఫాలో కావ‌డం లేదు. కొత్త రూట్ మ్యాప్ ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే అమెరికా, చైనాల‌తో పాటు దీటైన దేశంగా అన్ని రంగాల్లో రాణించేదిశగా దూసుకెడుతోంది. ఆయుధ  సంప‌త్తి సైతం పెంచుకుంటోంది.  గ్లోబ్ సౌత్ కి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి మోడీ మొన్న చాలా దేశాల్లో  ప‌ర్య‌టించారు. అంతే కాదు.. బ్రిక్స్ ద్వారా గ్గోబ్ సౌత్ లీడ‌ర్షిప్ కి ప్లానేస్తున్నారు. దీంతో ట్రంప్ కి మోడీ అంటే అస్స‌లు ప‌డడం లేదు అంటున్నారు విశ్లేషకులు. అవ‌స‌ర‌మైతే చైనా, ఆఫ్రికా దేశాల‌తో కొత్త జ‌ట్టు క‌ట్ట‌డానికి కూడా సిద్ధ ప‌డుతున్నారు మోడీ.  దీంతో మోడీ ని చూసి చికాకు ప‌డుతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా.

నిజ‌మే పాతిక  శాతం సుంకాల ద్వారా భార‌త్ లో కొన్ని   రంగాల‌కు తీవ్ర‌మైన ఇబ్బంది క‌ల‌గొచ్చు. ఇందులో పాడి, వ్య‌వ‌సాయ రైతుల‌కు, ఎన్నో చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ఎంఎస్ఎంఈల‌కు న‌ష్టం వాటిల్ల వ‌చ్చు.  అంతే కాదు.. ఎంపీ లావు పార్ల‌మెంటులో చెప్పిన‌ట్టు.. ఏపీ ఆక్వాకు భారీ న‌ష్టం కలగొచ్చు. ఎందుకంటే మ‌న స‌ముద్ర ఉత్ప‌త్తుల్లో 33 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఆ మాట‌కొస్తే మొన్న‌టి మామిడి రైతుల క‌డ‌గండ్ల‌కు కార‌ణం కూడా ఇలాంటి ప‌రిస్థితులే.

కొంద‌రేమంటారంటే మోడీ ఒక్క మాట మాట్లాడితే ఇలాంటి స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతాయి. పాతిక శాతం కాస్తా 15 నుంచి 20 శాతానికి దిగి వస్తుందంటారు.  బేసిగ్గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరు ప‌క్షాలు వ‌చ్చే కొన్నేళ్ల‌లో ద్వైపాక్షిక వ్యాపారం 500 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచాల‌న్న యోచ‌న‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో సానుకూలంగా స్పందిస్తే స‌రిపోతుంది. కానీ, మోడీ ఇందుకు స‌మ్మ‌తంగా ఉన్న‌ట్టు లేరు. పైపెచ్చు అమెరికా క‌న్నా చైనాను న‌మ్మ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ధ్య చైనా టూరిస్టుల‌కు వీసా అనుమ‌తులివ్వ‌డం ఇందులో భాగంగానే భావిస్తున్నారు. 

ఇక ఫైన‌ల్ గా ర‌ష్యాను వ‌దులుకోవ‌డం. ఎందుకంటే ప్ర‌పంచ‌మంతా ఉక్రెయిన్ లోన మార‌ణ‌కాండ ఆపాల‌ని ఎదురు చూస్తుంటే..  మోడీ,  భార‌త్ మాత్రం ర‌ష్యా నుంచి చ‌మురుతో స‌హా ఎన్నో ఆయుధ స‌హాయ స‌హ‌కారాల‌ను పొందుతున్నార‌ని ఆరోపిస్తారు ట్రంప్. నిజ‌మే ఇదే ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొన‌కుంటే జ‌రిగే విప‌త్తు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌ల్ బ్యార‌ళ్ల ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ లో ర‌ష్యాన్ ఎస్ 400 ద్వారా మ‌న‌మెంతో విజ‌యం సాధించాం.

అదే అమెరికాను దాని ఎఫ్ 16ల‌ను న‌మ్ముకున్న పాక్ ప‌రిస్థితి ఎలా ఉందో చూశాం. చైనా ఇచ్చిన పీఎల్ 15లు, ఇత‌ర వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా నిర్వీర్య‌మైన ప‌రిస్థితులు. మ‌నం కూడా అలాంటి ఫలితాల‌నే పొంద‌డానికి సిద్ధంగా లేమంటారు మోడీ ఆయ‌న ప‌రివారం. కాబ‌ట్టి ట్రంప్ ని ఫాలో కావ‌డం అయ్యే ప‌ని కాదని తెగేసి చెబుతారు. ఒక వేళ మోడీ మ‌న వాళ్ల‌కు ఉద్యోగాలివ్వొద్దంటే న‌ష్ట‌పోయేది అమెరికాయే. కార‌ణం మ‌న మేధ‌స్సు అక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల వృద్ధి చూపుతోంది. త‌ద్వారా అమెరికాకు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఆ మాట‌కొస్తే మ‌స్క్ ని కూడా ఇలాగే దూరం చేసుకుంటున్నారు ట్రంప్. ఆయ‌న వ‌ల్ల ఎంతో ల‌బ్ధి చేకూరుతున్నా.. కావాల‌ని మ‌స్క్ ఆదాయ వ‌న‌రుల‌ను గండి కొట్టేలా బిగ్ బిల్ వంటి బిల్లులు పాస్ చేయిస్తున్నారు. దీని వ‌ల్ల అంతిమ న‌ష్టం అమెరికాకే అన్న‌ది నిపుణుల అంచ‌నా. 

ఇప్ప‌టికే ప‌క్క‌నే ఉన్న మెక్సికో, కెనాడా వంటి  దేశాలతో స‌ఖ్యంగా లేక పోవ‌డం వ‌ల్ల‌.. కెన‌డియ‌న్లు అమెరిక‌న్ టూర్ లు  మానేస్తున్నారు. దీని వ‌ల్ల ఎంతో లాస్. ఎందుకంటే ఒక కెన‌డియ‌న్ అలా యూఎస్ టూర్ వ‌స్తే పెట్టే ఖ‌ర్చు మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్లు. ఇక‌ మెక్సిక‌న్లు అమెరికాలోకి చొర‌బ‌డకుంటే అక్క‌డ పాచిప‌ని, వంటప‌ని, మ్యూజిక్ వంటి రంగాల్లో ఆ వెలితి తీర్చ‌లేనిది. ఇక భార‌త్ ని కాద‌నుకుంటే స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ వెలితి ఏర్ప‌డుతుంది. చైనాను కాద‌నుకుంటే ఏకంగా అన్ని చౌక వ‌స్తువుల‌ను అత్య‌ధిక ధ‌ర‌లు వెచ్చించి కొనాల్సి వ‌స్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ సుంకాల వ్యూహంలో చిక్కింది అమెరికాయే త‌ప్ప‌.. భార‌త్, చైనా కాదంటారు  వాణిజ్య‌ నిపుణులు.  మ‌రి  చూడాలి.. ట్రంప్ తెంప‌రి త‌నం ఇక్క‌డితో ఆగుతుందా? లేక ఆయ‌న ఒంటి చేత్తో కొత్త ప్ర‌పంచం సృష్టిస్తారా.. కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.