చివరికి మిగిలేది?

Publish Date:Feb 23, 2022

Advertisement

బాలాస్తావతీ క్రీడాసక్తః 
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః 

భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!

వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః 

భావం: వయస్సు మళ్ళిపోతే కా మవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.  భజ గోవిందం లోని ఈ రెండు శ్లోకాలు నాకు కాలగమనము యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తూ ఉంటాయి. నిజమే కదా ఈ వయస్సు అన్నది శాశ్వతం కాదు. బాల్య వయసులో మనం ఆటల్లో గడిపేస్తాం. కొద్దిగా యవ్వనం లోకి రాగానే మన మనసుకు నచ్చిన వారితో సంసార సాగరంలో పడిపోతాము. మళ్లీ ముసలి వయసు రాగానే ఈ జబ్బులు ఆ జబ్బులతో ఒళ్లంతా రోగాలు మయం చేసుకుని, మనకు పాడి కట్టే రోజు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంటాము.

ఇదేనా జీవితం అంటే? నాకైతే ఇంతకుమించి ఏదో ఉంది అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న చివరికి చేరాల్సింది ఈ మట్టిలోనే. ఈ మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఎన్నో మారణహోమాలు, ఎన్నో దుర్మార్గాలు, మరెన్నో అవినీతి కార్యాలలో, చేతకాని వారిగా భాగస్వాములమవుతాం లేదా అటువంటి వారిని చూస్తూ చేతలుడిగి కూర్చుంటాము.

నిజానికి చివరికి మిగిలేది అనేది మనం ఎవరము ఆలోచించము కదా. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి చావు అనేదే లేనట్టు బతుకుతాడు కానీ ఎన్నడూ బతక లేనట్టు చస్తాడు. ఇది నిజం కాదంటారా?
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మనకు సమయం ఉండగానే మనం మనతోపాటు చివరి క్షణాల్లో మనకు అండగా వచ్చే వాటిని తీసుకుపోవాలి మరి మనకు అండగా వచ్చేదేంటి? ధర్మరాజుకున్నంత ధర్మాన్ని మనం పాటించలేము. ఈ కాలంలో అది అసలు కుదరని పని. కానీ కొంతలో కొంతైనా మనం ధర్మం పక్షాన నిలబడలేమా? చివరికి మనతోపాటు కొన్ని ఆత్మీయ అనుభూతులను మోసుకెళ్లలేమా? 

మన ఊపిరి వదిలే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఆస్వాదిస్తూ, మనతోపాటు పయనం చేస్తున్న సమస్త జీవరాశిని ప్రేమిస్తూ సాధ్యమైనంతలో సేవ చేస్తూ, బతికితే అదే చాలు ఈ జీవితానికి. ఏముందిలే ఇంకా నాకు బోలెడంత వయసు ఉంది. తీర్ధయాత్రలవీ చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించేసుకుంటాను అనే భ్రమను వదిలి ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నట్టు బతుకు నావను ఈశ్వరునికి అంకితం చేసేద్దాం.
మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే కళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ వీడు పోయి భూమికి భారం తగ్గింది అనుకుని నవ్వే పెదవులు ఉండకూడదు.

వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.