లాటరీ సొమ్ము పంచుకున్న స్నేహితులు
Publish Date:Jul 19, 2022
Advertisement
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అంటూ ఎన్టీఆర్, సత్యనారాయణ పాడుకుంటూ తమ స్నేహాన్ని పదికాలాలు గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు.. తెలుగు జంఝీర్ సినిమాలో. ఇలాంటివి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ నిజజీవితంలో అలాంటి స్నేహితులు అప్పుడప్పుడు కనపడు తూంటారు. పిల్లల పెంపకం విషయంలో, ఆస్తుల విషయంలో ఒకరికి ఒకరు సహాయపడటం జరుగుతూం టుంది. కానీ భారీ మొత్తంలో లాటరీ దొరికితే దాన్ని ఇద్దరూ పంచుకునేవారు ఉంటారా అంటే అనుమా నమే అనొచ్చు. కానీ పెర్రీచార్లెస్, స్కాట్ ఎడ్వర్డ్ మాత్రం అలా కాదు. ఇద్దరూ పంచుకున్నారు! ఉత్తర కరోలినాకి చెందిన పెర్రీ, స్కాట్ అనే స్నేహితులు ముప్పయ్యేళ్ల క్రితం విన్-డిక్సీ అనే సంస్థలో పనిచేసేవారు. ఆ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. ఇటీవల పెర్రీకి ఒక లాటరీలో 361,527 డాలర్లు వచ్చాయి. అంత సొమ్ము రాగానే ఇల్లు కొనాలనో, మనవడిని పెద్దబడిలో వేసేయాలనో, వేరే ప్రాంతానికి వెళ్లి బతికేయాలనో అనుకోలేదు. తనకు వచ్చిన సొమ్మును తనవారితో కాకుండా తన ప్రియ స్నేహితుడు స్కాట్‌తో పంచుకోవాలనుకున్నాడు పెర్రీ! ఇద్దరూ కలిసి ఒకే సంస్థలో పనిచేస్తూన్నపుడు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. తన జీవితంలానే తన స్నేహితుడి జీవితం ఉంటుందనే పెర్రీ అను కున్నాడు. తన సంతోషాన్ని, ఈ లాటరీ సొమ్మునీ ఇద్దరూ పంచుకుంటే మరీ బావుంటుందన్న గొప్ప ఆలోచన చేశాడు. అంతే వెంటనే తన స్నేహితుడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి కూడా చాలా కాలమయింది. అంతే.. ఎన్నాళ్లో వేచిన హృదయం..ఈనాడే ఎదురవుతుంటే.. అంటూ పాటపాడుకుంటూ, ఈల వేస్తూ ఎడ్వర్డ్ పరుగున చార్లీని కలిసేడు. ఇంటి విషయాలు మాట్లాడుకోలేదు.. ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నారు. అంతలో చార్టీ జేబులోంచి చెక్ తీసి చూపించాడు. ఎడ్వర్డ్ ఎంతో ఆనందించాడు. కానీ ఆ ఆనందాన్ని ఇద్దరం పంచుకోవాలన్నాడు చార్లీ. అది విన్న ఎడ్వర్డ్‌కి ఆనందంతో మాటలు తడబడ్డాయి. కొంతసేపు ఆనందబాష్పాలు ఇద్దరి మధ్యా మాటల్ని లేకుండా చేశాయి. కావలించుకున్నారు. చెక్‌తో బ్యాంక్ కి వెళ్లేరు.
http://www.teluguone.com/news/content/true-friends-25-140082.html





