Publish Date:Jul 19, 2022
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అంటూ ఎన్టీఆర్, సత్యనారాయణ పాడుకుంటూ తమ స్నేహాన్ని పదికాలాలు గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు.. తెలుగు జంఝీర్ సినిమాలో. ఇలాంటివి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ నిజజీవితంలో అలాంటి స్నేహితులు అప్పుడప్పుడు కనపడు తూంటారు. పిల్లల పెంపకం విషయంలో, ఆస్తుల విషయంలో ఒకరికి ఒకరు సహాయపడటం జరుగుతూం టుంది. కానీ భారీ మొత్తంలో లాటరీ దొరికితే దాన్ని ఇద్దరూ పంచుకునేవారు ఉంటారా అంటే అనుమా నమే అనొచ్చు. కానీ పెర్రీచార్లెస్, స్కాట్ ఎడ్వర్డ్ మాత్రం అలా కాదు. ఇద్దరూ పంచుకున్నారు!
ఉత్తర కరోలినాకి చెందిన పెర్రీ, స్కాట్ అనే స్నేహితులు ముప్పయ్యేళ్ల క్రితం విన్-డిక్సీ అనే సంస్థలో పనిచేసేవారు. ఆ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. ఇటీవల పెర్రీకి ఒక లాటరీలో 361,527 డాలర్లు వచ్చాయి. అంత సొమ్ము రాగానే ఇల్లు కొనాలనో, మనవడిని పెద్దబడిలో వేసేయాలనో, వేరే ప్రాంతానికి వెళ్లి బతికేయాలనో అనుకోలేదు. తనకు వచ్చిన సొమ్మును తనవారితో కాకుండా తన ప్రియ స్నేహితుడు స్కాట్‌తో పంచుకోవాలనుకున్నాడు పెర్రీ! ఇద్దరూ కలిసి ఒకే సంస్థలో పనిచేస్తూన్నపుడు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. తన జీవితంలానే తన స్నేహితుడి జీవితం ఉంటుందనే పెర్రీ అను కున్నాడు. తన సంతోషాన్ని, ఈ లాటరీ సొమ్మునీ ఇద్దరూ పంచుకుంటే మరీ బావుంటుందన్న గొప్ప ఆలోచన చేశాడు.
అంతే వెంటనే తన స్నేహితుడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి కూడా చాలా కాలమయింది. అంతే.. ఎన్నాళ్లో వేచిన హృదయం..ఈనాడే ఎదురవుతుంటే.. అంటూ పాటపాడుకుంటూ, ఈల వేస్తూ ఎడ్వర్డ్ పరుగున చార్లీని కలిసేడు. ఇంటి విషయాలు మాట్లాడుకోలేదు.. ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నారు. అంతలో చార్టీ జేబులోంచి చెక్ తీసి చూపించాడు. ఎడ్వర్డ్ ఎంతో ఆనందించాడు. కానీ ఆ ఆనందాన్ని ఇద్దరం పంచుకోవాలన్నాడు చార్లీ. అది విన్న ఎడ్వర్డ్‌కి ఆనందంతో మాటలు తడబడ్డాయి. కొంతసేపు ఆనందబాష్పాలు ఇద్దరి మధ్యా మాటల్ని లేకుండా చేశాయి. కావలించుకున్నారు. చెక్‌తో బ్యాంక్ కి వెళ్లేరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/true-friends-25-140082.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.