ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రిజైన్! హోరెత్తుతున్న సోషల్ మీడియా..
Publish Date:Nov 3, 2021
Advertisement
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో సంచనంగా మారింది. రాజకీయ సమీకరణల మార్పునకు నాంది కాబోతోంది. ఈటల రాజేందర్ ఘన విజయంతో బీజేపీ పండుగ చేసుకుంటోంది. తమకు డిపాజిట్ రాకపోయినా కేసీఆర్ ను ఓడించామనే సంతోషంలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఉద్యమ సంఘాలన్ని ఊరట చెందాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిస్తేజం అలుముకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోవడంతో గులాబీ లీడర్లంతా సైలెంట్ అయిపోయారు. హుజురాబాద్ ఫలితం తర్వాత కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హుజురాబాద్ ఉప సమరం సందర్భంగా జరిగిన టీవీ ఛానల్లో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు నడిచాయి. కొందరు నేతలు రాజీనామా సవాళ్లు చేశారు. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇలాంటి సవాలే చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు గువ్వల బాలరాదు. హుజురాబాద్ బై పోల్స్ పై సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.అంతేకాదు కొందరు నేరుగా గువ్వలకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. దీంతో ఫోన్ కాల్స్ రివీస్ చేసుకోలేక ఎమ్మెల్యే బాలరాజ్ తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకున్నారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-mla-guvvala-balraj-will-resign-soon-25-125744.html