ఉద్యమ నేతలకా.. బీటీ బ్యాచ్ లీడర్లకా! కేసీఆర్ ఎమ్మెల్సీ జాబితాలో ఉండేదెవరో? 

Publish Date:Oct 31, 2021

Advertisement

ఐదు నెలలుగా పెండింగులో ఉన్న శాసనమండలి ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కానుండటంతో అశావాహులంతా యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీలో ఉన్న బలం ఆధారంగా ఆరు సీట్లు అధికార టీఆర్ఎస్ కు దక్కనుండటంతో ... సీఎం కేసీఆర్ ప్రసన్నం కోసం గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో కేసీఆర్ ఎవరిని ఖరారు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన  ఆకుల లలిత, ఫరీజుద్దీన్, గుత్తా సుఖేందర్​రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. వీళ్లలో శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్​రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమంటున్నారు. ఆయనకు బెర్త్ ఖాయమైనట్లు కేసీఆర్ నుంచి సిగ్నల్ వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరినప్పుడే హామీ ఇచ్చినందున ఆకుల లలితకు మళ్లీ అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. మిగితా నాలుగు స్థానాల కోసం పలువురు పోటీ పడుతున్నారు. 

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పోస్టు ఆశిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్, కోటిరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వారే. దీంతో నల్గొండ జిల్లా నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి అవకాశం ఉండదంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. వీళ్లలో ఒకరిని కేసీఆర్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

ఉమ్మడి వరంగల్​జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఈసారి అవకాశం వస్తుందా.. లేదా అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దళిత సామాజికవర్గం నుంచి కడియం శ్రీహరికి చాన్స్ ఉంటుందని పార్టీ నేతల్లో కొంత ప్రచారం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వరని కూడా చెప్పుకుంటున్నారు. కడియం కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. హుజురాబాద్​రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్​రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్​ తీర్మానం చేసి పంపినట్లు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఇది పెండింగ్‌లో పడింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో పంపి.. గవర్నర్ కోటాలో మరొకరిని సిఫారస్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు, 

బొడికుంట్ల వెంకటేశ్వర్లకు కూడా రెన్యూవల్ ఉండవచ్చనే టాక్ వస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ స్పీకర్ మధుసూదనచారీ కూడా ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మైండ్ లో ఎవరదున్నది మాత్రం తేలడం లేదు. ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ కానుంది. అదేనెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణలకు అవకాశం.  నవంబర్ 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ ఉండగా.. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది. 

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.