Publish Date:Oct 22, 2019
ఒకపక్క ఆర్టీసీ సమ్మె... మరోపక్క విపక్షాల మూకుమ్మడి దాడి... ఇంకోవైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ... ఇలా నలువైపులా నుంచి ప్రత్యర్ధులు చుట్టుముట్టడంతో... ఇక, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు అనుమానమేనన్న చర్చ నడిచింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్... హుజూర్ నగర్ పై ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేశాయి. హుజూర్ నగర్ లో అసలు ఆర్టీసీ సమ్మె ప్రభావం లేనే లేదని తేల్చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయని ప్రకటించాయి. ఒకపక్క మిషన్ చాణక్య... మరోవైపు ఆరా... ఈ రెండు సర్వే సంస్థలు కూడా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయమని తేల్చేశాయి. మిషన్ చాణక్య సంస్థ టీఆర్ఎస్ కు 53.37శాతం ఓట్లు వస్తాయని చెబితే.... ఆరా 50.48శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అంతేకాదు ప్రతి మండలంలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడని తమ సర్వేల్లో తేలిందని ప్రకటించాయి. ఇక, అధికార టీఆర్ఎస్ కు ఒక్క కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇఛ్చిందన్న సర్వే సంస్థలు.... మిషన్ చాణక్య 41.04శాతం... ఆరా 39.95శాతం ఓట్ షేర్ ఇచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచినప్పటికినీ... గులాబీ పార్టీ మాత్రం భారీ ఆధిక్యం సాధిస్తుందని... ఇక, ఇతర పార్టీలేమీ కనీసం దరిదాపుల్లో కూడా లేవని ప్రకటించాయి. బీజేపీ, టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కదని సర్వేలు తేల్చేశాయి.
ఇక, హుజూర్ నగర్ గెలుపుపై టీఆర్ఎస్ అధిష్టానంలో ధీమా వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేసిన కేటీఆర్.... హుజూర్‌నగర్‌లో ఈసారి గెలుపు కారుదేనన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి.... మంచి మెజారిటీలో విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేశారంటూ కేటీఆర్ ప్రశంసించారు. ఓటింగ్ సరళి, ప్రజానాడి, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ సంస్థల సర్వేల ప్రకారం టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతోందని చెప్పారు. మరి సర్వేలు చెప్పినట్లు... గులాబీ నేతలు అంచనా వేస్తున్నట్లు... ఫలితం ఉంటుందో లేక... ఎగ్జిట్ పోల్స్ కు షాకిస్తూ కాంగ్రెస్ విజయం సాధించబోతుందో... అక్టోబర్ 24న తేలిపోనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-is-going-to-win-in-huzurnagar-bypolls-25-90396.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.