టీఆర్‌ఎస్ ఇమేజీకి.. ‘వర్షం’ డ్యామేజీ

Publish Date:Oct 15, 2020

Advertisement

‘కారు’ మబ్బులు.. విమర్శల ‘వర్షం’

 

ఇస్తాంబుల్‌గా మార్చేస్తాం.. మరో లండన్ చేసేస్తాం.. విశ్వనగరంగా మారుస్తాం.. ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా మారుస్తాం.. 640 కోట్లు ఖర్చు పెట్టాం.. ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో విన్నట్లు ఉన్నాయి కదూ?.. కేసీఆరో, కేటీఆరో, ఇంకెవరో మంత్రులో ఇప్పటికి కొన్ని వందల డజన్ల సార్లు చెప్పినట్లు అనిపిస్తోంది కదూ? యస్.. మీరేమీ పొరపాటునో, గ్రహపాటునో వినలేదు. మీరు విన్నది, గుర్తు చేసుకుందీ నిఝంగా నిజం! సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అనేక సందర్భాల్లో చేసిన బాసలే ఇవి. ఇచ్చిన ప్రసంగాలే అవి!

 

అది ఎంత నిజమో..  ఇప్పుడు మీరు చూస్తున్న వర్షనగరమూ అంతే నిజం. ఒక్కరోజు కురిసిన రాకాసి వర్షానికి, రాజధాని నగర రాదార్లు గోదార్లయ్యాయి. మొసళ్లు రోడ్లపైకి వచ్చాయి. చిన్నారులతోపాటు, కార్లు జలసమాధి అయ్యాయి. రోడ్లమీద ఉండాల్సిన నీళ్లు వంటింట్లోకి చేరాయి. కాలనీలు చిన్నపాటి చెరువులయ్యాయి. మొత్తంగా విశ్వనగరం విషాదనగరమయింది. దీనికి కారణం కొంత మానవ స్వయంకృతమయితే, మిగిలిన పాపాలన్నీ  పాలకుల ఖాతాలోనివే. లోతట్టు ప్రాంతాలు, నాలాలని తెలిసి కూడా అక్కడే ఇళ్లు కట్టుకున్న జనంలో.. ఇన్ని భారీ వర్షాలు, ఇంత ప్రాణనష్టం  కూడా మార్పు తీసుకురాలేపోయాయి. కళ్లెదుటే కొట్టుకుపోతున్న కుటుంబాల ఆర్తనాదాలు కూడా,  అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించలేకపోతున్నాయి. ఇది నిస్సందేహంగా ప్రజల స్వయంకృతమే.

 

మరి ప్రభుత్వానికయితే బాధ్యత ఉంది కదా? వారిని బలవంతంగానయినా ఖాళీ చేయడం పాలకుల బాధ్యత కదా? అయినా ఓట్ల కోసం వారికి ఇంటి నెంబర్లు, రేషన్‌కార్డులిస్తున్న పాపం పాలకులదే కదా? కోట్లాదిరూపాయలతో వేస్తున్న రోడ్లన్నీ ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయంటే, వాటి నాణ్యతపై నిఘా పెట్టడంలో సర్కారు విఫలమయినట్లే అర్ధం. సెప్టెంబర్ 18న కురిసిన వర్షం మిగిల్చిన కాళరాత్రిని, ‘సిటి’జనులు ఇంకా మర్చిపోకముందే.. మరో జలప్రళయం నగరాన్ని నరకం చేయడాన్ని ప్రజలు తాళలేకపోతున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి, మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో ఓ బాలిక, మరో ఘటనలో మరో మహిళ కొట్టుకుపోయిన విషాదం మరువకముందే ఇంకో ఉత్పాతం. కలసి వెరసి.. టీఆర్‌ఎస్ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత.

హైదరాబాద్ నగరంలో 16.4 కి లోమీటర్ల మేర నాలాలు విస్తరిస్తామని కేటీఆర్ మొదట్లో హామీ ఇచ్చారు. ఇంకా ఆ లక్ష్యానికి 60 శాతం అడుగుల దూరంలో ఉన్నారు. అంటే గమ్యాన్ని ముద్దాడేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు వేసిన కిర్లోస్కర్ కమిటీ.. 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలు విస్తరించాలని, అందుకోసం 10 వేల ఆక్రమణలు తొలగింపుతోపాటు, వీటికి 6700 కోట్లు ఖర్చు అవుతుందని  నివేదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆ కమిటీ కొండెక్కింది.

 

మళ్లీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, వోయాంట్స్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ కమిటీ చేసిన సర్వేలో.. 28 వేల ఆక్రమణలు తొలగించాలని, 390 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాలని, అందుకు 12 వేలు కోట్లు ఖర్చవుతుందని నివేదిక ఇచ్చింది. చివరాఖరకు 12,182 ఆక్రమణలున్నట్లు తేల్చింది. 390 కిలోమీటర్ల మేర ఉన్న నాలా ఉండగా, అందులో పైకప్పులున్నవి చాలా తక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆక్రమణలు పెరిగాయన్నమాట. మరి జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.

 

ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్‌కుమార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు,  పౌరులకు ఓ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎవరైనా సరే.. గుంతలు పడిన రోడ్లు చూపిస్తే బహుమానం ఇస్తామన్నారు. అంటే హైదరాబాద్ రోడ్డు వంగి ముద్దుపెట్టుకోవాలన్నంత అందంగా.. చాలా సొంపుగా ఉంటాయని, అసలు గుంతలే ఉండవన్నది ఆయన కవి హృదయమన్నమాట. ఆయన సవాలుకు జవాబుగా, విపక్షాలు గుంతలుపడ్డ చోట నిలబడి ఫొటోలు దిగడంతో, సోమేష్‌కుమార్ ఇక ఆ సవాలు ముచ్చటే మర్చిపోయారు.

 

ఇప్పుడు మళ్లీ వందేళ్ల తర్వాత వచ్చిన జలప్రళయం రాజధానిని ముంచేసింది. జనజీవనాన్ని భయకంపితులను చేసింది. మళ్లీ.. ‘కఠిన చర్యలు’, ‘హామీ’ల వర్షం, ‘తగిన జాగ్రత్తలు’ అనే  పాలకుల పడికట్టు పదాలు, మామూలుగానే వినిపిస్తున్నాయి తప్ప, ఆచరణ శూన్యం. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ వర్షాఘానికి బలవుతున్న నగర ప్రజలు, సహజంగానే టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను కష్టాల కడలి నుంచి కాపాడటంలో విఫలమయిందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు-కార్పొరేటర్లు చోద్యం చూస్తున్నారని, అధికారులు తమను గాలికొదిలేశారన్న నిర్ణయానికి వచ్చారు.  ఖచ్చితంగా ఇవన్నీ,  రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపేవే.

 

ప్రజల ఆగ్రహజ్వాల,  ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రమాదఘంటికనే. ప్రభుత్వ అసమర్ధ నిర్వాకం వల్లనే,  తాము గంటలపాటు కరెంటు-నిత్యావసర వస్తువులకు దూరమయ్యామని, రోజంతా నరకయాతన అనుభవించామన్న చేదు జ్ఞాపకాలు, విషాద దృశ్యాలు అప్పటివరకూ జనం గుర్తుంచుకుంటే..  ‘కారు’ ఒక్క అడుగు కూడా ముందుకేయడం కష్టం. ఈ అసంతృప్తి అగ్నికి విపక్షాలు,  ఎన్నికల వరకూ ఆజ్యం పోయకుండా ఉంటారనుకోలేం. అప్పటికీ నష్టనివారణకు దిగకపోతే నగరంలో షి‘కారు’కు...  కష్టమే! సహజంగా వర్షాలొస్తే పాలకులకు పండుగ. జనం కష్టాలు మర్చిపోతారు. కానీ రాజధాని నగరంలో వర్షాలొస్తే, పాలకుల ఇమేజీ దారుణంగా  డ్యామేజీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. 

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.