ఆంద్ర ప్రజలపై తెరాస ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు?

Publish Date:Jul 3, 2014

Advertisement

 

తెరాస ప్రభుత్వం భూముల స్వాధీనం విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఇంతవరకు చట్ట విరుద్దంగా ఆక్రమింపబడిన భూములపైనే దాడులకు అనుమతి ఈయడంతో, సంబందిత వ్యక్తులు తప్ప ఇతరులెవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏపి.ఎన్.జి.ఓ. సంఘానికి గోపన్న పల్లె వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన 189 ఎకరాల భూమిని ఎటువంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో వారిని కోరుండి రెచ్చగొట్టినట్లయింది.

 

శేరీలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓ సురేష్ తమ సిబ్బందితో కలిసి వెళ్లి ఏపీయన్జీవోలకు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వారికి ఇల్లు కట్టుకోనేందుకు భూమి కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగనందున భూమిని స్వాదీనం చేసుకొంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ భూమిని ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇల్లు కట్టుకోనేందుకు ఇచ్చింది తప్ప, ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు రాయితీ మీద పరిశ్రమలో, వ్యాపార సంస్థలో పెట్టుకొనేందుకు అమ్మలేదు. ప్రభుత్వం ఏపీ యన్జీవో సంఘం సభ్యులందరికీ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా ఇచ్చింది. కానీ ఆ భూమి తమదంటూ వేరే కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం వలన, ఇతరత్రా కారణాల వలన ఉద్యోగులు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు. కానీ దానిని సాకుగా చూపి ఆంద్ర ఉద్యోగులకు కేటాయించిన భూములను తెరాస ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాదం కవ్వింపు చర్యే అవుతుంది.

 

వారం రోజుల క్రితం జీ.హెచ్.యం.సి. అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ లోకి జొరబడి కొలతలు తీసి, అది ఆక్రమింపబడిన స్థలంగా గుర్తులు వేయడంతో, వారి చర్యలను ఖండిస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై కోర్టు స్పందిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయనిదే ఎవరిపై చర్యలకు పాల్పడవద్దని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, శేరీలింగంపల్లి తహశీల్దార్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓలు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ప్రభుత్వోద్యోగులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొంటున్నామని ప్రకటించడంతో, ఏపీ యన్జీవోలు న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఒకవేళ వారు భూమిపై తమ హక్కులను కోర్టులో నిరూపించుకోగలిగి, వారి వాదనలతో కోర్టు కూడా ఏకీభవించినట్లయితే తెరాస ప్రభుత్వం అభాసు పాలవవచ్చును.

 

రెండు మీడియా చాన్నాళ్ళపై నిషేధం, నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు, నాగార్జున సాగర్ నుండి ఆంధ్రాకు నీటి విడుదలకు అభ్యంతరాలు, ఇప్పుడు ఎన్జీజీవోల భూములు స్వాధీనం వంటి తెరాస ప్రభుత్వం చర్యలన్నీ ఆంద్ర ప్రజలపై చాలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లే ఉన్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తరువాత కూడా రాజకీయ నేతల్లాగే వ్యవహరిస్తే దాని వలన వారే అప్రదిష్ట పాలవుతారు.

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.