టీఆర్ఎస్ కౌన్సిలర్ మందు వేసి రచ్చ రచ్చ..
Publish Date:Jun 16, 2021
Advertisement
అది నిజామాబాద్ జిల్లా ఆర్మర్ పట్టణం. అతను టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్. తెలంగాణలో వాళ్లదే పై చేయి ఉండాలి.. అందుకోసం ఎంతటి నీచమైన పనికైనా పూనుకుంటారు. ఈ టీఆరఎస్ లీడర్స్. అందితే మీద అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. పట్నం లీడర్ కానుంచి పల్లే లీడర్ వరకు టీఆర్ఎస్ నాయకుల జన్మనక్షత్రం ఆ అలవాటు. అసలే అదిరకం లో ఉన్నారు.. అధికారులు మాటవినకపోతే.. మందు వేసి నోటికి మస్తు మస్తు హంగామా చేయడం వీళ్ళకి ముందు నుండి ఉన్న బుద్ది. ఇలాంటి వార్తలు చాలానే చూశాం. తాజాగా ఒక మున్సిపల్ కౌన్సిలర్ మందు వేసి.. మున్సిపల్ ఆఫీస్ ముందు.. అధికారులపై పెద్ద సినిమానే చూపించాడు.. మరి అసలు విషయంలోకి వెళ్దామా..
గంగా మోహన్ చక్రు ఆర్మూర్ మున్సిపాలిటీలోని 15 వ వార్డ్ కౌన్సిలర్. అయితే అధికారులు, మున్సిపల్ సిబ్బంది తన మాట వినటం లేదంటూ మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి మున్సిపల్ మేనేజర్ మనోహర్, టీపీవో రాజేష్ లతో గొడవకు దిగాడు. ఆఫీస్ ముందు రచ్చ రచ్చ చేశాడు. అక్కడితో ఆగక ఒక రౌడీలా ప్రవర్తించాడు. టీపీవో కు సంబంధించిన కంప్యూటర్ లను ధ్వంసం చేశాడు. దీంతో అక్కడే వున్న సిబ్బంది అతనిని సర్దిచెప్పి అక్కడి నుండి పంపించారు. ఈ సంఘటన బుధవారం అలస్యంగా వెలుగు చూసింది. కేవలం బల్ధియా అధికారులు తాను చెప్పిన పనులు చేయ్యడం లేదని అధికారులతో గొడవకు దిగి నానా రభస చేయ్యడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. బుధవారం ఈ సంఘటనపై బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే కమిషనర్ రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/trs-armoor-municipality-councilor-drink-a-alcohol-39-117768.html





