Publish Date:Aug 15, 2022
అనువుగాని చోట అణ కువగా ఉండా లన్నారు పెద్దలు. పాపం బండి సంజ య్‌కి ఇది అం తగా పట్టిం పు లేనట్టుంది. అప్పుడే అధి కారంలోకి వచ్చేసినట్టు సుదీర్ఘ ఉప న్యాసాలతో ఆకట్టుకుని తన బీజేపీకి తెలంగాణాలో మహోపకార్యం చేయాలన్న అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.ఆయన తమ పాదయాత్రలో భాగంగా జనగామజిల్లా దేవరుప్పుల గ్రామం లో తిరుగుతూండగా ఊహించని ప్రశ్నలకు తట్టుకోలేకపోయారు. అక్కడి టిఆర్ ఎస్ అభిమానులు తిరగబడి రాళ్లదాడి చేశారు.
బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో మధ్యలో మైలారం దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించారు. బండి సంజ య్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్‌కి స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు. పోటాపోటీ నినా దాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం(ఆగష్టు 15) ఉదయం ప్రారంభమైంది. సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలం గాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అన్న ధీమాతో మరిత రెచ్చిపోయి ప్రసంగాలు చేయ డం ఆనవాయితీగా మారిందన్నది విశ్లేషకుల మాట.
దేవురుప్పుల గ్రామంలో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా విమర్శ నాస్త్రాలు సంధిస్తుండగా టీఆర్ ఎస్ కార్యకర్త ఆయన్ను మీ మోదీగారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని జనంలో నుంచి వ్యక్తి నిల దీశాడు.
దీంతో ఘాటుగా స్పందించిన బండి సంజయ్ తన సహజ పంథాలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వమను, తమాషాలు చేస్తున్నారా? యూజ్లెస్ ఫెలోస్... తెలంగాణ ఎవరు తెచ్చారు, మీ కేసీఆర్ తెచ్చాడా. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పెన్షన్లు ఇవ్వు మను, రైతు రుణమాఫీ చేయుమను కేసీఆర్‌ని. దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు, దళితులకు మూడెకరాలు ఎం దుకు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు.
అప్పటిదాకా ఆయన మాట తీరుకు రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు కూడా ధీటుగా స్పందించడంతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నిర్మల మల్లారెడ్డి, రాములు కార్తీక్ తీవ్రం గా గాయపడ్డారు. వారిని పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-activists-attack-on-bandi--25-141956.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.