తృణమూల్ ని వీడని ఈడీ.. మరో మంత్రికి సమన్లు
Publish Date:Sep 1, 2022
Advertisement
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే విపక్షాల మీదకు ఈడీ, సిబిఐ వ్యవస్థలను ఉసి గొల్పుతోందన్న ఆరోపణలు దేశమంతటా విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ పార్టీలను ఈడీలు వెంటాడుతున్నారనే చెప్పాలి. ఈ మధ్యనే తృణమూల్ కాంగ్రెస్ అధి నేత మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ కార్యదర్శి అభిషేక్‌ను ఆయన భార్యను ఈడీ ప్రశ్నించింది. ఇపుడు తాజాగా ఆ పార్టీ మరో మంత్రి మోలాయ్ ఘటక్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణం కేసులో వీరిని ఈడీ విచారిస్తున్నది. మంత్రి మోలాయ్ గతంలో విచారణలో వివరాలు చెప్పక పోవ డంతో అతన్ని మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది. మంత్రి మోలాయ్ తో పాటు టీఎంసీ ఎమ్మెల్యే మహతోకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. బొగ్గు అక్రమ రవాణా ఆరోపణలపై అంతకుముందు మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్ర వారం ఉదయం కోల్‌కతాలోని కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్యకు , అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండుసంస్థల విదేశీబ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈవ్యవహారంలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ విచార ణకు హాజరు కావా లని ఈడీ అధికారులు ఆదేశించారు. విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో పార్థ ఛటర్జీ ఇటీవల అరెస్టయ్యారు. తాజాగా గురు వారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమెకు అత్యంత సన్నిహిత సహచరుడు, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ను అరెస్ట్ చేసింది.ఆవులను అక్రమంగా రవాణా చేసి నట్లు 2020 లో నమోదైన కేసులో ఆయనపై ఈ చర్య తీసుకుంది. ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమా చారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదర గొట్టి మోండల్‌ను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరు కావాలని పది పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడిం చింది. దీంతో సీబీఐ కోర్టును ఆశ్ర యించింది. అంతకుముందు ఆయనను రెండు సార్లు సీబీఐ ప్రశ్నిం చింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, 2015 నుంచి 2017 మధ్య కాలంలో విదేశాలకు తరలిస్తుండగా 20 వేలకుపైగా ఆవుల తలలను బిఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దీనిపై సీబీఐ 2020లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అతను పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బొగ్గు మైనింగ్ వ్యాపార కార్యకలాపాల కింగ్‌పిన్ అనుప్ మజీ భాగ స్వాములలో ఒకడు. మజీ, అతని సహచరుల నుండి అక్రమ బొగ్గు గనుల వ్యాపారం ద్వారా వచ్చిన నేరాల ద్వారా రూ. 66 కోట్లకు పైగా మాజీ అందుకున్నాడు. ఇంకా, అతను వసతి ఎంట్రీలను తీసుకునే ఉద్దేశ్యంతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి కోల్‌కతాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌కు రూ. 26 కోట్ల నగదు అందించాడని ఈడీ అధికారి తెలిపారు. ఇవి రాజకీయ వేధింపులేనని అభిషేక్ ఆరోపించారు. ఈడీ నోటీసులు పంపిస్తుందని మమతా బెనర్జీ ముందే అన్నారని, అలాగే జరిగిందని తృణమూల్ నేత సౌగత్ రాయ్ గుర్తుచేశారు.
8 మంది ఐపిఎస్ లకు ఈడీ సమన్లు
ఇలా ఉండగా, గతంలో సుకేష్ జైన్, జ్ఞానవంత్ సింగ్, రాజీబ్ మిశ్రా, శ్యామ్ సింగ్, సెల్వ మురుగన్, కోటే శ్వర్ రావు వంటి టాప్ పోలీసులు సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది ఐపిఎస్ అధికారుల ను ఈడీ ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బొగ్గు మైనిం గ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసు కు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ కేసులో ఇది మూడో అరెస్టు. అంతకుముందు, పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. 2021లో వారిపై చార్జి షీట్ కూడా దాఖలయింది. నిందితుడు గురుపాద మాజీని పిఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం అరెస్టు చేసినట్లు సీనియర్ ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈడీ రోస్ అవెన్యూ కోర్టులో మాజీని హాజరు పరిచింది. కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి పంపింది.
http://www.teluguone.com/news/content/trinamul-under-ed-pressure-25-143050.html





