వెళ్ళిపోయీ నవ్విస్తున్న ఎమ్మెస్ నారాయణ
Publish Date:Jan 23, 2015
Advertisement
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్వస్థలం నిడమర్రుకు వెళ్ళిన ఎమ్మెస్ నారాయణ అక్కడ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. గురువారం నాడు ఆయన మరణించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆయన మరణించలేదని ఆ తర్వాత తెలిసింది. నలుగురినీ నవ్వించే ఎమ్మెస్ నారాయణ సజీవంగా వున్నారన్న వార్త అందరికీ సంతోషాన్ని కలిగించింది. అయితే ఆ సంతోషం ఒక్క రోజు కూడా నిలబడలేదు. శుక్రవారం నాడు ఆయన మరణించారు. ఈ వార్త విన్న తెలుగువారు ఎంతో బాధపడుతున్నారు. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించిన ఆయన తన వైవిధ్యమైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎమ్మెస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 1951వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. బాగా చదువుకున్న ఆయన భీమవరంలోని ఓ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా రచయిత అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రచయితగా ఆయన కొద్ది సినిమాలకు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఆయన హాస్య నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. వంశీ దర్శకత్వం వహించిన ‘లింగబాబు లవ్ స్టోరీ’ నటుడిగా ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘మా నాన్నకి పెళ్ళి’ సినిమాలో తాగుబోతు పాత్రను ధరించడంతో ఆయన కెరీర్ మంచి మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించారు. తాగుబోతు పాత్రలను ధరించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. పేరడీ పాత్రలను ధరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా నటించారు. ఆయన్ని చూస్తేనే ప్రేక్షకులకు నవ్వు వచ్చేంతగా ఆయన నటుడిగా పరిణితిని సాధించారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన కృషి చేశారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా ‘కొడుకు’, ‘భజంత్రీలు’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హాస్య నటుడిగా ఎమ్మెస్ నారాయణ రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు సినిమాల ద్వారా ఐదుసార్లు నంది అవార్డులు పొందారు. దూకుడు సినిమాలో ఆయన నటనకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. నటుడిగా ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ మాత్రమే కాకుండా... మంచి మనిషిగా, మృదుభాషిగా కూడా పేరు సంపాదించుకున్న ఆయన ఆకస్మికంగా మరణించడం దురదృష్టకరం. ఆయన చనిపోయిన శుక్రవారం నాడే ఆయన నటించిన ‘పటాస్’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ‘సునామీ స్టార్’ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు కంటతడి పెట్టించారు. ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మరణించినప్పటికీ ఆయన పంచిన హాస్యం తెలుగు ప్రజల పెదవుల మీద చిరస్థాయిగా మెరుస్తూనే వుంటుంది.
http://www.teluguone.com/news/content/tribute-to-ms-narayana-32-42426.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





