Publish Date:Oct 19, 2024
వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్న సంగతి విదితమే. అయితే ఆమెకు పోటీగా బీజేపీ తరఫున ప్రముఖ నటి ఖష్బూ బరిలో నిలవనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఖుష్బూ స్వయంగా ఖండించినప్పటికీ ఆగడం లేదు. ఎందుకంటే వాయనాడ్ లో తన పోటీ వార్తలను ఖండిస్తూనే ఒక వేళ బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను పోటీకి రెడీ అని ఖుబ్సు ముక్తాయించడమే. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధించిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. రాయబరేలి లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వాయనాడ్ కు రాజీనామా చేసి రాయబరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పీపీ సునీర్‌పై 4 లక్షల 31వేల మెజార్టీతో విజయం సాధించగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి యేనీ రాజాపై 3 లక్షల 64వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఆమెకు పోటీగా ప్రముఖ నటి ఖుష్బును నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీపై పోటీ రెడీ అనడం ద్వారా ఇక్కడ నుంచీ పోటీకి ఖుష్బూ కూడా రెడీ అయినట్లే చెప్పవచ్చు. ఏది ఏమైనా వాయనాడ్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, కమలం పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ అభ్యర్థిగా నిలవడం ఖరారైనట్లే, కమ్మూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి వామపక్షాల అభ్యర్థిగా సత్యన్ మొరేఖీ నిలబడుతున్నారు. ఇక కమలనాథులు తమ అభ్యర్థిగా ఖుష్బూను రంగంలోకి దింపడం దాదాపు ఖాయమైందంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని చెబుతున్నారు. వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 13న జరగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటే వాయనాడ్‌లోనూ ఫలితం వెలువడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/triangular-fight-in-vayanad-25-187048.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.