Publish Date:Oct 19, 2024
ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెలుగులోకి రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కల్తీ నెయ్యి వినియోగం విషయంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆ విషయం అలా ఉండగానే.. శబరిమల ప్రసాదంలోనూ కల్తీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా అన్నవరం సత్యన్నారాయణ స్వామి ప్రసాదంలోనూ కల్తీ జరుగుతోందని వెల్లడైంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ మూర్తి దేవాలయంలో భక్తులకు అందజేసే ప్రసాదంలో కల్తీ జరుగుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్న భక్తుల పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నవరం ప్రసాదం రుచి విషయంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న తరువాత ఎంతో భక్తితో ప్రసాదాన్ని ఆరగిస్తారు. అంతే కాకుండా తిరుమల దేవుని ప్రసాదంలాగే అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని కూడా తమ తమ ఊర్లకు తీసుకువెళ్లి అందరికీ పంచుతారు. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, బెల్లం, యాలకుల పొడితో తయారుచేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఆ ప్రసాదం తయారీలో కల్తీ బెల్లం విడుతున్నట్లుగా వెలుగులోనికి వచ్చింది. సుక్రోజ్ శాతం అధికంగా ఉన్న బెల్లంతోనే సత్యదేవుని ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు కల్తీ నిరోధక శాఖ నిర్ధారించింది. బెల్లం, నెయ్యి నాణ్యతను పరిశీలించకుండానే ఆలయ అధికారులు ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లాన్ని ఒక ప్రైవేటు సంస్థ అతి తక్కువ ధరకే సరఫరా చేస్తోందని అంటున్నారు. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లంలో కల్తీ ఉందని అధికారులు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adultretion-in-annavaram-prasadam-25-187058.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.