36 బస్సుల సీజ్ తో ప్రక్షాళన జరిగిపోతుందా?
Publish Date:Jun 20, 2012
Advertisement
రాష్ట్రంలో అక్రమంగా నడుపుతున్న 36 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వాటిలో 15 బస్సులు కాలేశ్వరి ట్రావెల్స్ కు సంబంధించినవి. 91 బస్సుల యజమానులపై కేసు పెట్టారు. కాలేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు షిర్డీ వెళ్ళేదారిలో ప్రమాదం జరగటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందించిన రవాణాశాఖాధికారులు ప్రక్షాళనకు నడుంబిగించారు. దీనిలో భాగంగా తమకు అనుమానం వచ్చిన అనేక అంశాలపై ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ప్రై'వేటు' యజమానుల అక్రమాలకూ అద్దం పట్టే సాక్ష్యాలను వెదికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్నా వాహనాల కింద లెక్కకు వచ్చిన 91 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 36 బస్సులను సీజ్ చేశారు. వీటిలో 25 బస్సులు హైదరాబాద్ కు చెందినవే కావటం గమనార్హం. విశాఖపట్నంలో నాలుగు బస్సులను కూడా సీజ్ చేశారు. హైదరాబాద్ లో సీజ్ చేసిన బస్సులను ఖైరతాబాద్ లోని ఆర్తీఎ కార్యాలయానికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద మూడు ప్రైవేటు బస్సులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చెక్ పోస్ట్ వద్ద 12, శంషాబాద్ షాపూర్ చెక్ పోస్ట్ వద్ద 5 బస్సులను సీజ్ చేశారు. ప్రతీ ఏటా వందకోట్ల రూపాయలు పన్నుగా చెల్లించే తమను మీడియా మాఫియాగా చిత్రీకరించటం తగదని ప్రైవేటు ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాకు వ్యతిరేకంగా ఈ సంఘం నినాదాలు చేసింది. హైదరాబాద్ లో కొందరు పత్రికాప్రతినిథులను బెదిరించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో దుడుకుగా వ్యవహరించిన ప్రయివేటు ఆపరేటర్లను పోలీసులు అదుపు చేశారు. షిర్డీ వెళ్ళే బస్సుకు ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్షమే కారణమని ఆందోళనల నేపథ్యంలో రవాణాశాఖ డ్రైవింగ్ పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించి ఆ తరువాత పరీక్ష పెడతారు. దీనిలో పాసైతే ఫర్వాలేదు కానీ, లేకపోతే మళ్ళీ పరీక్ష కూడా తప్పదు. ఈ పరీక్షలో పాసైతేనే డ్రైవర్ ను వాహనం నడపటానికి అనుమతి ఇస్తారు. ఇదిలా ఉండగా పాఠశాలలు వాడుతున్న బస్సుల ఫిట్ నెస్ కూడా పరీక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అసలు లైసెన్సు లు కూడా లేకుండా పాఠశాలల బస్సులు నడుపుతున్నారని ఆరోపణలున్నాయని రవాణా అధికారులకు తెలిపారు. ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులను రోడ్డుదీడకు వదలకుండా కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
http://www.teluguone.com/news/content/travel-buses-in-hyderabad-24-14991.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





