పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి లోకేష్

Publish Date:Apr 14, 2026

Advertisement

 

- ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం 

- పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి 

 "కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిల‌కు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం 

పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జుల‌ శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.

 సిద్ధాంతాలే నాయకత్వానికి బలం 

“ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు.

 ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామ‌స్థాయికి తీసుకెళ్లాలి 

“ఎన్ని ప‌నులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక‌ ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు.

 పార్టీతో కార్య‌క‌ర్త‌ల‌ను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్ 

“ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్య‌వ‌స‌రం. రాజకీయాల్లో కొత్త త‌రాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌నులు పూర్తిచేసుకుని కొంత స‌మ‌యం కేటాయించి క్షేత్ర‌స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.

 రెడ్ బుక్ స‌మాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం 

“గతంలో దేవాలయంలాంటి  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్ప‌డ్డారు. అమర్నాథ్ గౌడ్‌, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యల‌ను వెంటాడి మ‌రీ చంపారు. డా.సుధాకర్‌,  కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిల‌ను వేధించి మ‌ర‌ణానికి కార‌కుల‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు విధ్వంసం-దాడులు-హ‌త్య‌లు-అవినీతితో చెల‌రేగిపోయిన జ‌గ‌న్..అధికారం పోయాక కూట‌మి ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారాల‌తో విరుచుకుప‌డుతున్నాడు.  ఐక‌మ‌త్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చే ఫేక్ స‌మాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్‌ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జ‌గ‌న్‌ సమాజాన్ని నాశ‌నం చేయాల‌నుకున్నాడు.  ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగ‌న్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు జ‌గ‌న్‌. ``

 నేతల మధ్య సఖ్యత ముఖ్యం 

“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకున్న‌ట్టే, కూట‌మి నేత‌లు కుటుంబంలా  కూర్చొని చ‌ర్చించుకుని విభేదాలు విడ‌నాడ‌లి`` అని సూచించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.