గెలుపే లక్ష్యంగా  రేవంత్ సోషల్ ఇంజనీరింగ్.. సక్సెస్ అవుతారా?   

Publish Date:Aug 21, 2021

Advertisement

“తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒంటరిగా దూసుకు పోతారే కానీ, నలుగురినీ కలుపుకు పోరు. అందుకే అయన అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో చిక్కుకు పోతారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు దూరంగా ఉండడానికి కూడా ఈ దూకుడు స్వభావమే కారణం” రేవంత్ పోకడలపై కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తున్న తాజా విశ్లేషణ ఇది. 

అయితే ఇది నిజమేనా అంటే, కొంతవరకు నిజం. కొంత కాదు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం నిజం. ఒక విధంగా చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి దూకుడు అవసరం. రేవంత్ రెడ్డి దూకుడు చూపుతున్నారు కాబట్టే, రాష్ట్ర రాజకీయాల్లో ‘రైట్ ఆఫ్’  స్టేజికి చేరుకున్న  హస్తం పార్టీ మళ్ళీ లేచికూర్చుంది. గుర్తింపు తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు కాబట్టే, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు, ఒక్కటి తగ్గకుండా లక్ష మందిని సమీకరించగలిగారు. అఫ్కోర్స్ జన సమీకరణలో సీతక్క పేరు చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది, అనుకోండి అది వేరే విషయం.కానీ, దండోరా సభ సక్సెస్’కు మొదటి అడుగు ఆయన దూకుడులోనే ఉంది. అంత భారీ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేని స్థితి నుంచి, సభను సక్సెస్ స్థితికి తీసుకుపోయారంటే , ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా,  అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. చివరకు, అధికార పార్టీలోనూ దడ పుట్టించింది.  

దండోరా సభ దడ పుట్టించింది కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయించారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఎమ్మెల్యేలకు కోటా ఫిక్స్ చేసి,ఏసీ బస్సులు పెట్టి, జన సమీకరణ చేశారు. అయినా, ఇంద్రవెల్లి సభ ముందు హుజూరాబాద్ సభ వెలవెల పోయిందనే చెప్పాలి. నిజమే,జనం వచ్చారు, కానీ, ఇంద్రవెల్లిలో కనిపించిన జోష్ హుజూరాబాద్’ లో కనిపించలేదు. అంతే, కాదు హుజూరాబాద్ సభకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు నిరాశగా వేణి దిరిగారు. కొంతమంది అయితే అధికార పార్టీని తిట్టుకుంటూ వెళ్ళడం కూడా కనిపించింది.  

సరే అదలా ఉంటే రేవంత్ రెడ్డికి దూకుడే గానీ, ఆలోచన లేదు అనే వాదనలోనూ పస లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఒక పథకం ప్రకారం సోషల్ ఇంగినీరింగ్’ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రావిర్యాలలో నిర్వహించిన గర్జన సభలో తమ దూకుడు  ప్రసంగంలోనూ, ఇటీవల ఐపీఎస్ కొలువు వదులుకుని,బీఎస్పీలో చేరిన  ప్రవీణ్ కుమార పేరు తీసుకున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రవీణ్ కుమార్ మరో ఆరేళ్ల సర్వీస్’తో పాటు  డీజీపీ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా, ఉన్న అవకాశాలను వదులుకుని దళితుల మేలు కోసం రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. అలాగే, ఉద్యోగంలో కొనసాగుతూ, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలు, వివక్షను భరించలేక, దళిత బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కొలివుకు రాజీనామా చేశారని చెప్పారు.ఇలా ప్రవీణ్ కుమార్’ను ఆకాశానికి ఎత్తేయడం, రేవంత్ రెడ్డి రాజకీయ విజ్ఞత, ముందు చూపుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్;లో బీఎస్పీపీ కలిసి సాగేందుకు, రేవంత్ ముందుగానే కర్చీఫ్ వేశారనీ అంటున్నారు.ఇలా కర్చీఫ్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి, కొత్త సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టారనిఅనే మాట కూడా వినవస్తోంది. 

అలాగే ఇటీవల పీసీసీ, మైనారిటీ సెల్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు కార్యక్రమలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి, “కాంగ్రెస్ పార్టీ మీదే, ముస్లిం మైనారిటీలదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే”  అంటూ మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని, గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ తెరాస ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కానీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం పేరు కూడా ప్రస్తావించలేదు. 

ఇలా అటు దళితులను,ఇటు ముస్లిం మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రేవంత్ దూకుడులోనూ ఒక ఆలోచన, సోషల్ ఇంగినీరింగ్ వ్యూహం  ఉన్నాయని నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరటానికి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలు, అలాగే, బడుగు బలహీన వర్గాలు పార్టీకి దూరం కావడమే అనేది ఒక చారిత్రక సత్యం. రేవంత్ ప్రస్తుత ప్రయత్నాలను జాగ్రత్తగ గమనిస్తే, ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే రాజకీయ విజ్ఞతను చూపుతున్నారనిపిస్తుంది. దూరమైనా ఒక్కొక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుని ‘సోషల్ ఇంగినీరింగ్’ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం  భావిస్తున్నారు. అయితే, సోషల్ ఇంగినీరింగ్ ప్రయత్నాలలో అయన సక్సెస్ అవుతారా, అంటే అది వేరే విషయం, వేరే చర్చ అంటున్నారు విశ్లేషకులు. 

By
en-us Political News

  
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.
రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది. అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు. 25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి. గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.
నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను.
పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, అంతకు మించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు.
జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.
 పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు
పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.