టాప్ ఛానెల్ ఇద్దరు యాంకర్లపై కేసు.. అసలేం ఏం జరిగింది?
Publish Date:Jul 26, 2021
Advertisement
జాతీయ స్థాయిలో టాప్ టీవీ ఛానల్ గా ఉన్న ఓ మీడియా సంస్థలో తీవ్ర దుమారం రేగుతోంది. డేటా చౌర్యం వ్యవహారం ఆ సంస్థలో ప్రకంపనలు స్పష్టిస్తోంది. ఓ యాంకర్ కు సంబంధించిన ఫోన్ నుంచి మరో ఇద్దరు యాంకర్లు డేటాను తస్కరించారు. అందులో వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం ఉండటంతో.. బాధిత యాంకర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న ఇద్దరు మహిళ యాంకర్స్ పై సైబర్ క్రైమ్స్ లో కేసు నమోదైంది. IPC 66, R/w 43, 84(B)ఐటి ఆక్ట్, R/w 511 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. టాప్ టీవీ ఛానెల్ లో పనిచేసే ముగ్గురు తన ఫోన్ నుంచి డేటా తస్కరించి.. పర్సనల్ ఫొటోస్ వీడియోస్ బయటపెడుతామని తనను బెదిరించినటు యువతి పిర్యాదు చేసింది. ఎన్నిసార్లు సార్లు అడిగిన ఫోన్ ఇవ్వకుండా బెదిరించారని ఆరోపించింది. మానషికంగా శారీరకంగా వేధిస్తున్నట్లు బాధిత యువతి పోలీసులకు దిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి మొదట పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. టాప్ టీవీ ఛానల్ కావటంతో మీ అంతట మీరు వివాదం పరిష్కరించుకుంటే ఓకే..లేదంటే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపినట్లు సమాచారం. అయినా సరే కూడా వివాదం ఎంతకూ పరిష్కారం కాకపోవటంతో.. యాంకర్ ఫోన్ నుంచి డేటాను తస్కరించిన ఇద్దరు యాంకర్లను ఆ యాజమాన్యం రిజైన్ చేయాల్సిందిగా ఆదేశించిదంట. దీంతో వారిద్దరు రాజీనామా చేయటం జరిగాయి. దీంతో కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు యాంకర్లు ఆ టీవీ ఛానల్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. బాధిత యాంకర్ ఈ వ్యవహారాన్ని మొదట అక్కడ బాధ్యతలు చూసే ప్రధాన ప్రజంటర్ దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కరించాల్సిన ఆయన కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫిర్యాదులో ఆయన పేరు కూడా జతచేసినట్లు సమాచారం. అదే సమయంలో బాధిత యాంకర్ వేధించిన వారిలో ఓ హెచ్ ఆర్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఎప్పుడు బయటకు వస్తుందో...ఏమి అవుతుందో అన్న ఆందోళనలో ఆ హెడ్ తోపాటు మరికొంత మంది సిబ్బంది టెన్షన్ టెన్షన్ లో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/top-tv-channel-anchors-booked-fir-in-hyderabad-39-120345.html





