ఇప్పటికి అమరావతే.. మూర్ఖుడు మారుతాడా.. కొండపల్లి రచ్చ.. మరో గండం.. టాప్ న్యూస్@7PM

Publish Date:Nov 22, 2021

Advertisement

ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ.. 3 రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు.సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
--------
మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని ట్విట్టర్‌లో లోకేష్‌ మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. 3 రాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అన్నారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని నారా లోకేష్‌ అన్నారు.
--------
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం మహిళలపై గౌరవం ఉంటే.. తన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.దేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుడు ఎక్కడా చూడలేదన్నారు.
--------
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపు చోటుచేసుకుంది. కౌన్సిల్ హాల్‌లో జరిగిన రభస అనంతరం తమకు రక్షణ లేదని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. తమను మున్సిపల్ భవనంలోనే ఈ రాత్రికి ఉండేందుకు అనుమతివ్వాలని కౌన్సిలర్లు అధికారులను కోరారు. రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు  లేఖ ఇచ్చారు. ఎంపీ నాని ఓటు హక్కుపై కోర్టులో కేసు సాగుతుండటంతో.. ఎన్నికను రేపటికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు. 
-----
దక్షిణాంధ్రకు మరో ప్రమాదం పోంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ అవుతోందని, రాబోయే 4-5 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప అనంతపురం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. 
----
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు. 
----
సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ ఘాటు విమర్శలు చేశారు. 19వ రోజు వడ్లపై క్లారిటీ ఇస్తానన్న కేసీఆర్‌కు తాగిన మత్తు దిగలేనట్లు ఉందన్నారు. కేసీఆర్‌ దేశాలు తిరగడానికి ప్రైవేట్‌ హెలికాప్టర్ కావాలా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో తాగి తినుడు తప్ప..వ్యవసాయం ఎన్నడు చేశారని నిలదీశారు. పనికిమాలిన సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆరేనని దుయ్యబట్టారు. ఏ పంట వేయాలో చెప్తానన్న కేసీఆర్ ఎక్కడున్నారు? అని అర్వింద్ ప్రశ్నించారు.
------
ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదని, కొనేది లేదన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని తెలిపారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుందన్నారు. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పలపైనే.. రైతుల గుండెలు ఆగిపోతున్నా.. సీఎం కేసీఆర్‌ గుండె కరుగటం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
---
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో నెలకు 1,000 రూపాయలు వేస్తామని పంజాబీ మహిళలకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలు ఇందుకు అర్హులేనని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం పంజాబ్‌లోని మోగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు 

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.