ఏపీ ఎంపీలు పరమ వేస్ట్.. రఘురామ లేఖాస్త్రం.. మరో సమరం.. బిగ్ ఫైట్.. టాప్ న్యూస్@7PM

Publish Date:Oct 31, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తమను గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. సభలో స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు. 
----
ఎన్‌జీటీ చైర్మన్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. విశాఖ రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. వెంటనే కేసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. 
----------
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నవంబర్‌ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. 
--------
వ్యక్తులకు పదవి అలంకారం కాదు బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. పూర్వ విద్యార్థులు ఎదిగిన తర్వాత తమ స్కూలు గురించి మర్చిపోకుండా స్కూలు అభివృద్ధికి సహకారం అందించారన్నారు. పదవి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోకుండా సేవ చేయడమే పదవికి న్యాయం చేయడమని ఆయన పేర్కొన్నారు. మనిషికి మానసిక వికాసానికి విద్య ఉపయోగపడుతుందన్నారు.
---------
2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
---------
పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధానిలను ఏలూరులో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వారి నుంచి లక్షా 50 వేలు అసలు నోట్లు, 12 లక్షల విలువైన  నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
---------
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ  తెలంగాణ లో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల  జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన  అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి  ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లు గా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయ్యారు. 
-----
కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు.  పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని  హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.   
-------
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భుబనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో  ఈ ఘటన జరిగింది. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 
--------
తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా చనిపోయాడంటూ కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలను తోసిపుచ్చుతూ మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్లు ప్రకటించారు. కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే ఇస్లామిస్ట్ పాఠశాలను హైబతుల్లా ఆదివారం సందర్శించారని, అక్కడ ప్రజలకు ఆయన కనిపించారని ఓ అంతర్జాతీయ మీడియాకు తాలిబన్ తెలిపింది. 

By
en-us Political News

  
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.