అనంతలో లోకేశ్‌.. ఈట‌ల ఆగ‌యా.. ష‌ర్మిల 72 గంట‌ల దీక్ష‌.. టాప్‌న్యూస్ @1pm

Publish Date:Nov 10, 2021

Advertisement

1. అనంత‌పురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ద‌గ్గ‌ర‌ విద్యార్థుల ఆందోళనతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. విద్యార్థులు కాలేజ్‌ గేట్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మ‌రోవైపు నారా లోకేష్‌కు అనంత‌ జిల్లా సరిహద్దుల్లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

2. కుప్పంలో రాత్రి జరిగిన సంఘటన బ్లాక్ డే అని టీడీపీ విమ‌ర్శించింది. అర్ధరాత్రి దాటాక బలవంతంగా పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టు చేసి బయటకు గెంటి వేయడం దారుణమని మండిపడింది. పులివెందల రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయడం, భ‌య‌బ్రాంతులకు గురి చేయడం ప్రజలు సహించరన్నారు. 

3. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈటలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈట‌ల వెంట‌ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. అంత‌కుముందు రాజేంద‌ర్‌.. గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. 

4. ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి పురుడు పోసుకున్నారు. ఈ విషయం తెలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలెక్టర్ దంపతులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరువగైన సేవలు అందిస్తున్నాయని ట్విట్టర్‌లో మంత్రి హరీష్ తెలిపారు. 

5. మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీ కొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి అవంతి ఇంటి ముందు నిరసనకు దిగారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని మృతుని బంధువులు అంటున్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

6. ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర‌ ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆందోళనపై మంత్రి తలసాని సమాధానం దాటవేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మాత్రం ఇందిరా పార్కు ద‌గ్గ‌ర‌ ధర్నాకు ప‌ర్మిష‌న్ ఎలా ఇస్తుంద‌ని ప్ర‌శ్నించ‌గా మంత్రి సమాధానం ఇవ్వలేక‌పోయారు. 

7. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసై పోతారని హెచ్చ‌రించారు. బీజేపీ నేతలు దళిత బంధు కోసం డప్పులు కొట్టడం దురదృష్టకరమన్నారు. బండి సంజయ్ దళిత బంధు వద్దని డప్పు కొడుతున్నట్లుగా ఉందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని మోత్కుప‌ల్లి ప్రశ్నించారు. 

8. రైతుల కోసం 72 గంట‌ల దీక్ష‌కు కూర్చుంటాన‌ని ప్ర‌క‌టించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌. కేసీఆర్‌కు చిత్త‌శుద్ధి ఉంటి యాసంగి పంట‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంపై నెపం మోపి త‌ప్పించుకోవాల‌ని చూస్తే వ‌ద‌ల‌బోమ‌ని హెచ్చ‌రించారు ష‌ర్మిల‌. 

9. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజు కొన‌సాగుతోంది. ప‌ర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మ‌హా పాద‌యాత్రకు సంఘీభావం తెలిపేందుకు సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు. 

10. మ‌లాలా యూస‌ఫ్ జాయ్‌. పాకిస్తాన్‌లో బాలిక‌ల విద్యా కోసం నిన‌దించిన గొంతుక‌. తాలిబ‌న్ల తూటాల‌కు బెద‌ర‌ని బాలిక‌. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌. తాజాగా, మ‌లాలా వివాహ బంధంలో అడుగుపెట్టారు. పాక్ క్రికెట్ కోచ్‌ అస్స‌ర్‌తో నిఖా చేసుకున్నారు. బ్రిటన్‌, బర్మింగ్‌హమ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో షాదీ జరిగింది. 24 ఏళ్ల మలాలా త‌న పెళ్లి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. భ‌ర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. 
 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.