డీఎంకే ఓటమి.. అసలేం జరిగింది?

Publish Date:May 4, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్నాళ్లుగా తిరుగులేని శక్తిగా కనిపించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే   కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటూ ఇచ్చిన తీర్పు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టాలిన్ స్పీడుకు ఓటర్లు బ్రేకులు వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఎన్నికల ఫలితాల్లో  విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.   ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, శాంతి భద్రతల సమస్య,  అవినీతి ఆరోపణలు పాలక పక్షాన్ని చావుదెబ్బ తీశాయి. ఫలితాల సరళిని గమనిస్తే, యువత,  మహిళా ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పునిచ్చినట్లు స్పష్టమవుతోంది.  

 స్టాలిన్ హయాంలో తమిళనాడు ప్రగతి సాధారణమైనది కాదు. ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధి విషయంలో స్టాలిన్ గణనీయమైన పురోగతి సాధించారు.   ఆయన హయాంలో సుమారు  రాష్ట్రం 9% జీడీపీతో   భారతదేశంలోనే రెండవ  స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో ఐటీ రంగం, అలాగే ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల విషయంలో కూడా గణనీయమైన అభివృద్ధి నమోదైంది. అయినప్పటికీ..  ఇవేవీ డీఎంకే పరాజయాన్ని నిలువరించలేకపోయాయి.   

రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేసిన దానికంటే భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని ఈ ఫలితాలు నిరూపించాయి. స్టాలిన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చాయి.  నిత్యావసర ధరల పెరుగుదల మరియు నిరుద్యోగ సమస్య కూడా డీఎంకే ఓటమిలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది.

స్టాలిన్ వ్యక్తిగత ఇమేజ్ బాగున్నప్పటికీ, పార్టీలోని ఇతర నేతల వైఖరి పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేశాయి. గెలుపుపై ధీమాతో ఉన్న డీఎంకే శ్రేణులకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.  

గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్, ఈ ఐదేళ్ల కాలంలో తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వారసత్వ రాజకీయాలనే విమర్శలు, కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందనే ఆరోపణలు కూడా ఆయనపై ప్రతికూల ప్రభావం చూపాయి. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా అధికారాన్ని ఇవ్వరనే సాంప్రదాయాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు.  

By
en-us Political News

  
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.