Publish Date:Aug 15, 2022
రెండు స్థంభాలకు తాడు గట్టి ఓ పిల్ల కర్ర ఆదారంతో ఆ తాడు మీద నడుస్తూ ఒక వేపు నుంచి మరో వేపు నడుస్తుంది. ఈలోగా నేల మీద జనం చూస్తు ఆశ్చర్య పోతూంటారు. ఒకడు డప్పు వాయిస్తూ పాటందుకుం టాడు.. ఇది మనం చిన్నపుడు చూసిన, ఇప్పటికీ మర్చిపోలేని గొప్ప ఫీట్. దీనికే మనం ఓర్నీ ఏం నడిసిందిరా! అనుకున్నాం. మరో వ్యక్తి కాలుతున్న కర్రముక్క కిల్లీ వేసుకున్నట్టు నోట్లో వేసుకుని క్షణం తర్వాత తనకేమీ తెలీన్నట్టు బయటికి ఉమ్మేస్తా డు. ఇదో గొప్ప ఫీట్! మరి గాల్లో పుల్లప్స్ చేసేవాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!
ఇటీవలికాలంలో ఫిట్నెస్ పిచ్చి పెద్ద పెద్ద నగరాల నుంచి మారుమూల పల్లెల వరకూ పట్టుకుంది. కుర్రాళ్లకి వారి సినీ హీరోలు సల్మాన్, ప్రబాస్‌లా తయారైపోతే అమ్మాయిలు ఢామ్ అని పడతారని గొప్ప నమ్మకం. ఈ పిచ్చిలో అనేక వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చేసే వ్యాయామాలకు పరిమితి ఉంటుంది. కానీ ఓవరాక్షన్ చేస్తే అది ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అన్నట్టు ఈ ఫిట్నెస్ పిచ్చి ప్రపంచదేశాల్లో ఏకంగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కెంతగా పట్టింది. ఏదో ఒకటి చేసే బదులు పుషప్స్ చేసి రికార్డుల్లోకి ఎక్కాలనే కుర్రాళ్ల సంఖ్య మరీ పెరిగిపోయింది. ఆ మధ్య స్టాన్ బ్రౌనీ స్నేహితుడు అర్జెన్ ఆల్బర్స్ ఏకం గా ప్రపంచరికార్డు బద్దలు కొట్టాడట. అతను వాళ్లింటో పుషప్స్ చేస్తూ జనాన్ని, గిన్నిస్ సంస్థ అధికారులను పిలిచి టీలు, కాఫీలు ఇచ్చి వాళ్లెదుట పుషప్స్ చేయలేదు. అతగాడి పిచ్చికి ఏకంగా హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. అదెలా సేసేడ్రా బావా.. అని మనూళ్లలో అనుకునేలాగానే పూర్తి చేసి రికార్డు సాధించారు.
ఈ ఏడాది జూలై 6న బెల్జియం ఆంట్వర్ప్‌లో స్టాన్, ఆల్బర్స్ లు ప్రపంచరికార్డు అధిగమించే పులప్స్ పోటీకి సిద్దపడ్డారు. హెలికా ప్టర్ వెళుతూంటుంది, దానికి వేలాడుతూ పులప్స్ చేయడం. ఏమాత్రం పట్టు తప్పినా, చేసే క్రమం తప్పినా మనిషి దక్కడు. కానీ వాళ్లిద్దరికీ ప్రాణాలకంటే ప్రపంచ రికార్డు మీదే ప్రేమ. అదే సాధించారు. వీళ్లు ఏకంగా 25 పులప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీళ్లు సామాన్యలు కాదనుకున్నారు అందరూ. కిందకి రాగానే తాకి మరీ చూశారు.. బతికే ఉన్నారా, పోయా రా అని! ఇలా హెలికాప్టర్ పులప్స్ చేయడం ఇపుడు ప్రపంచపోటీల్లో భాగం చేస్తారట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/too-crazy-25-141946.html
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.