ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ.. ఇప్పుడప్పుడే కాదు!

Publish Date:Jan 1, 2025

Advertisement

పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చినప్పటికీ.. పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న చర్చ మాత్రం ఆగలేదు.

ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్ గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే... ఆయన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొని ఉంది. అంతే కాకుండా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు, అలాగే  జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి. మెగా పవర్ స్టార్ గా ఆయనకు ప్రేక్షకులలో తిరుగులేని ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. 

అయితే పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమపై కూడా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావడంపై తాను పెద్దగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే షూటింగుల కోసం వారే ఇక్కడకు వస్తారని ఆయన చెప్పారు.

అయితే రాష్ట్రాలుగా విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాలే తనకు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అయినా హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషి కూడా ఒక కారణమన్న ఆయన   తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ పరిశ్రమ అయినా ఒక రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అనేది అంత తేలిక కాదన్న చంద్రబాబు నాయుడుఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలం పడుతుందని, వాటిని కల్పించిన తరువాతే పరిశ్రమను ఏపీకి ఆహ్వానించడంపై ఆలోచిస్తాననీ, ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని విస్పష్టంగా చెప్పారు.  

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.