మంత్రి రోజాని వదిలించేసుకున్న టాలీవుడ్?!

Publish Date:Oct 7, 2023

Advertisement

ఏపీ మంత్రి   రోజాది ఆంధ్రప్రదేశా? లేక ఆమె సెలబ్రిటీగా3 ఎదిగిన తెలంగాణనా? లేక పెళ్లి చేసుకున్న తరువాత మెట్టిన  తమిళనాడా?.  ఉన్నపళంగా ఇప్పుడు ఆ డౌటానుమానం  ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటున్నారా! ఆ అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి రావడానికి ఆమె తీరే కారణం.

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా  దుమారం రేపాయి. దీంతో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించుకుని మరీ వారం రోజుల తర్వాత మంత్రి రోజా మీడియా ముందుకు వచ్చారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అంతే కాకుండా టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయారు. స్వతహాగా నటి కనుక  తన నటనా పాటవాన్ని  మీడియా ముందు ప్రదర్శించారు. తనకు కుటుంబం ఉందని.. స్త్రీలంటే మీకు అంత చులకనేంటని ప్రశ్నలు గుప్పించేశారు.

ఆ తరువాత  ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి  బండారు సత్యనారాయణపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, బెయిల్ దక్కడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ తతంగానికి ముందు రోజా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ మహిళలను ఇట్లా అనడం న్యాయమూ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ట్రోలింగ్ ఇంకా కొనసాగుతోంది.   వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అసలు ప్రత్యక్ష రాజకీయాలలోనే లేని మహిళపై ఇష్టారీతిన నిందలు వేయడం, నోరుంది కదా అని  రోజా దమ్ముంటే రేప్ చేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు, టీవీ షోలోనే కనీసం మహిళలు వినేందుకు కూడా ఇష్టపడని రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు అంతర్జాలం సాక్షిగా గుర్తు చేస్తున్నారు.  ప్రజలు ఇప్పుడు రోజా మీడియా ముందు కన్నీటి పర్యంతం కావడాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి సొంత పార్టీలో కూడా రోజాకు మద్దతు లభించడం లేదు. పార్టీలోని తోటి మహిళా నేతలు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను  కనీసం ఖండించలేదు. రాష్ట్రానికి మహిళా హోమ్ మంత్రి ఉన్నా కూడా తోటి మంత్రి రోజాకు మద్దతుగా నిలవలేదు.  దీంతో సొంత పార్టీలో రోజాను పట్టించుకునే వారెవరూ లేరని తేటతెల్లమైపోయింది.

సరే రాజకీయాలను పక్కన పెడితే.. ఆమె ఎదుగుదలకు కారణమైన సినీ పరిశ్రమ నుంచీ కూడా రోజాకు మద్దతు దక్కలేదు.  సహజంగా సినీ రంగంలోని వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు, అందునా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తే  అదో బిగ్ ఇష్యూ అవుతుంది. కానీ, రోజాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఆమెకు కనీస మద్దతు దక్కలేదు. వివాదాలతో నిత్యం సహవాసమో, సహజీవనమో చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,  జగన్ పార్టీని ఎవరైనా ఏమైనా అంటే.. ఆ అన్నదేమిటో తెలియకపోయినా తనదైన శైలిలో, మ్యానరిజమ్ తో మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించేసే నటుడు పోసాని కృష్ణమురళి  ఆమెకు మద్దతుగా  గళమెత్తినా పెద్దగా జనం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ సపోర్టు రాలేదు. దీంతో వారు కూడా మౌనం వహించారు. వారి మాటలను జనం కూడా  వైసీపీ నేతలకు తక్కువ.. పేటీఎం బ్యాచ్ కు ఎక్కువ అనుకున్నారో ఏమో అసలు పట్టించుకోలేదు.

ఇక రోజాతో పనిచేసిన హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటీమణులు, ఇండస్ట్రీ పెద్దలు.. చివరికి వైసీపీలోనే ఉంటూ పదవులు కూడా అనుభవిస్తున్న కమెడియన్ అలీ లాంటి వాళ్ళు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలను ఖండించడం అటుంచి కనీస స్పందన కూడా తెలపలేదు. దీంతో   దీంతో టాలీవుడ్ రోజాను వదిలించేసుకుందా అని నెటిజన్లు అంటున్నారు.  
అయితే, రోజాకు  స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఆమె రాజకీయంగా ఎదిగిన తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతుగా కనీస స్పందన లేకపోవడం చూస్తుంటే.. తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాష్ట్రాలు, చివరికి సొంత పార్టీ కూడా ఆమెను దూరం పెట్టడమే మంచిదని భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. లేకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.