ఆ టీఎంసీ నేత.. ఇల్లే బంగారం!
Publish Date:May 15, 2026
Advertisement
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇల్లంతా బంగారమే. మంచాల దగ్గర నుంచి ఆ ఇంట్లో ప్రతి ఫర్నీచర్ బంగారంతో తయారైందే. శిబ్పూర్ టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే నివాసంలో ఓ కేసు నిమిత్తం సోదాలు నిర్వహించిన పోలీసులకు బంగారంతో తయారు చేసిన ఫర్నీచర్ తో ఆ ఇల్లు మెరిసిపోవడం చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. కాగా సోదాలు జరిగిన సమయంలో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది. పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అరెస్టు భయంతో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన నివాసాంలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో ఆయన ఇంట్లో బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు.. ఆయన నివాసంలోని మెట్లదారి రహస్య తలుపును తెరిచిన పోలీసులకు కిలోల కొద్దీ బంగారం కనిపించింది.
http://www.teluguone.com/news/content/tmc-leader-shamim-ahmmad-house-fullgold-36-219833.html





