Publish Date:May 14, 2025
తిరుపతి గంగమ్మ జాతర వేడుకగా ముగిసాయి. బుధవారం ( మే 14) ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం అయ్యింది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంతం, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తారు. ఆలయంలోని విశ్వరూప స్తూపానికి గంగమ్మ విశ్వరూపాన్ని తయారు చేశారు. ఆలయం ముందు బాగంగలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగళి, గొల్ల వంటి మిరాశిదార్లు పాల్గొంటారు.
గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు ఆచ్చారులకు అందించడం ఆనవాయితీ. అచ్చారులు నీలిమందునూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలిరంగును అద్దారు. బంగారు పూతపూసిన చేప ఆకారంలో చెక్కిన ముక్కెరను అలంకరించారు. బంగారం రంగురేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలా మెరిసే సింగపూరు రేకుతో చేసిన కమ్మలు, జుంకీలను అలంకరిస్తారు. మంగళి వాళ్ళు గంగమ్మ బొమ్మ తలమీద తలవెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేర్చి, పొడవుగా వేలాడదీశారు. బంగారంలా ధగధగ మెరిసే సింగపూరు రేకుతోనే చేసిన నగిషీలు చెక్కిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం క్రింద మల్లెపూలతోను., కనకంబరాలతోను అలంకరించారు. గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీలా పెట్టారు. నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా రూపాని పెట్టారు. నోటినిండా ఎర్రకుంకుమను నింపారు. వెదురు రెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు కట్టారు. గొల్లవాళ్లే తెచ్చిన మంగళసూత్రాలను గంగమ్మ మెళ్ళో వేశారు. గంగమ్మ చీరకు ఒడిబాలును గొల్లవాళ్లే తెచ్చి పెట్టారు. కొద్దిసేపు బంగారు తాళిబొట్లును గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివరలో పెడ్తారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు.
తెల్లవారు జామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తూనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. గంగమ్మ బొమ్మ దగ్గరుండే వారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూలహారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేశారు. తర్వాత చుట్టూ ఉన్న జనం, అరుపులు, కేకలు, కిలారింపులు అధికమయ్యాయి. పంబలవారు పంబను వాయిస్తూంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ, ఆవేశంతో, ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేయడాన్నే "గంగమ్మ చెంప నరకడం" అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్ళిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. మొదటి తాతయ్యగుంట గంగమ్మ చెంప నరికి.. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తి అయ్యింది. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మ్రొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తం అయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirupathi-gangamma-jathara-close-25-198031.html
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.