Publish Date:Aug 30, 2021
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వరుని నిలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలను అతి పవిత్రంగా భావిస్తుంటారు. అయితే తిరుమల ఆలయ వ్యవహారాలు చూసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆలయానికి మచ్చ తెస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా గత రెండేండ్లుగా టీటీడీ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్యమత ప్రచారం మొదలుకుని ఆలయ ప్రసాదాల వరకు అన్నింటా విమర్శలే ఎదుర్కొంది టీటీడీ బోర్డు. శ్రీవారి సన్నిధిలో వెలుగుచూస్తున్న ఘటనలపై భక్తులు ఆవేదన చెందుతున్నా టీటీడీ తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే టీటీడీ ప్రవేశపెట్టిన సంపద్రాయ భోజనంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా శ్రీవారి కల్యాణ మండపాల లీజు విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది.
తెలుగు రాష్ట్రాలలోని 177 కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 299 కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించింది. గతంలో కల్యాణ మండపాల పరిస్థితులపై విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఓ కమిటీని నియమించింది. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా చోట్ల కల్యాణ మండపాలు నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు నివేదిక అందింది. కొన్ని ప్రాంతాల్లో కల్యాణ మండపాలో గేదలను మేపుతున్నట్లు ఫోటోలోతో విజిలెన్స్ సమాచారం ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఇకపై కల్యాణ మండపాలను నిర్మించకూడదని పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని గత పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తిరిగి కల్యాణ మండపాల నిర్మాణానికివైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితితో కల్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ…. మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కల్యాణ మండపాల నిర్మాణంపై నిర్దిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
ఇటీవల సంప్రదాయ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలనే నిర్ణయంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్న ప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని ఆయన అన్నారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారని, వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారని చెప్పింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-tirupati-devasthanams-to-lease-out-191-kalyana-mandapams-in-telugug-states-25-122229.html
Publish Date:May 10, 2026
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.