తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అలిపిరి సమీపంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మరీ సిట్ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్నది. ఈ విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దాదాపు 15 మందిని సిట్ అదుపులోనికి తీసుకుని పలు దఫాలు విచారించింది.
లడ్డూ కల్తీ విషయం లో గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి కి పీఎస్ గా ఉన్న అప్పన్న ను తాజాగా అదుపులోనికి తీసుకుంది. అప్పన్న ద్వారా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో పలు రకాల వ్యవహారాలు జరిగాయని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కల్తీ వ్యవహారంలో అప్పన్న పాత్ర ఏమిటి? అప్పన్నతో పాటు ఈ వ్యవహరాంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో గత మూడు రోజులుగా సిట్ అధికారులు అప్పన్నను విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా అప్పన్న ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా త్వరలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి కి, అప్పటి టీటీడీ జేఈవోలు, ఇతర అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చి వాచారించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి త్వరలో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు వేగంతో రానున్న రోజులలో ఎవరెవరికి నోటీసులు అందుతాయి, ఇంకెతంత మంది అరెస్టౌతారు, అసలీ కల్తీ వ్యవహారంలో కీలక పాత్రధాలు, సూత్రధారులు ఎవరు అన్నది త్వరలో తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-laddu-prasadam-adultration-case-25-199342.html
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.