డిక్లరేషనే దిక్కా.. లడ్డూ వివాదంలో జగన్ ను వదిలేసిన వైసీపీ సీనియర్లు?

Publish Date:Sep 27, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం తార స్థాయికి చేరుకున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. శుక్రవారం తిరుపతికి చేరుకోనున్న వైఎస్ జగన్.. శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తమపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలలో పర్యటించి.. శ్రీవారి దర్శనం తీసుకోనున్నారు. అయితే వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారి దర్శనం వేళ.. డిక్లరేషన్ అంశం కీలకంగా మారింది.  కొందరు హిందూ సంఘాల నేతలు.. జగన్ తిరుమలకు రావద్దని పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంతటి ఉద్రిక్తతల నేపధ్యంలో జగన్ శనివారం (అక్టోబర్ 28) తిరమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే జగన్ ను అడ్డుకుని తీరుతామంటూ.. బీజేపీ, హిందూ సంస్థలు ఇప్పటికే హెచ్చరించారు.  

ఇదంతా పక్కన పెడితే జగన్ డిక్లరేషన్ ఇస్తారా? అన్న విషయమే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.  జ .జగన్ 27 వతేదీనే తిరుమల చేరుకుంటారు. అదే సమయంలో హిందూ సంస్థలు,బీజేపీ  జగన్ తిరుమల వెళ్లాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల పవిత్రత కాపాడాలని హిందూ సంఘాలు మూడు రోజుల పాదయాత్ర చేట్టాయి.ముఖ్యంగా  బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధరేశ్వరి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మాత్రం తాను 2009లో డిక్లరేషన్ ఇచ్చానని ప్రకటించారని,ఒ కసారి డిక్లరేషన్ ఇస్తే చాలని ఇప్పుడు ఇవ్వనవసరం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేసి చేతులు ఊరుకోవడమే వైసీపీకి అవకాశం ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ జ్యుడిషియల్ విచారణ కాని, సీబీఐ విచారణ గాని చేయాలని డిమాండ్ చేస్తున్నది. అయితే తెలుగుదేశం వైసీపీ డిమాండ్ పై స్పందించడం లేదు.  ఎందుకంటే.. సందేహాలకు అతీతంగా వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అవకతవకలు  ఒక్కోటి బయటకు వస్తున్నాయి. వాణీ ట్రస్ట్, విఐపీ టిక్కెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు,  కొనుగొళ్లలో కమీషన్లు వైసీపీ పరువును ఇప్పటికే పాతాళానికి దిగజార్చాయి. ఈ వివాదాల్లో పలువురు వైసీపీ నాయకుల హస్తం ఉందనే జనం నమ్ముతున్నారు.లడ్డూ తయారీకి వాడే ఆవునెయ్యి లో రివర్స్ టెండరింగ్ ద్వారా ధరలను తగ్గించడం కూడా ఉత్పత్తి దారుడికి కల్తీ చేసే అవకాశం అప్పటి టిటీడీ పాలకమండలి   ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఆదాయం బాగానే వస్తున్నా కూడా రివర్స్ టెండరింగ్ లు, నాణ్యతా ప్రమాణాలను తగ్గినా పట్టించుకోకవడం ఎందుకు అంటే  కమీషన్ల కోసమేనని పలువురు భావిస్తున్నారు. జనబాహుల్యంలో కూడా అదే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతున్నాది. 

గతంలో జగన్ సీఎం కుమారుడిగా, సీఎంగా తిరుమల అనేక సార్లు వెళ్లారు. కాని డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారం అడ్డంపెట్టుకుని వెళ్ళారు.ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అందులో లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా ఆయన శ్రీవారిని దర్శించుకోవడం అనుమానమే. డిక్లరేషన్ ఇవ్వడం అంటే వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం ఉందని చెప్పడమే. మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.  ఇక ధర్మ పరిరక్షణ జేఏసీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ కు నిజంగా వెంకన్న దేవుడిపై విశ్వాసం ఉంటే భార్య భారతి తో తిరుమల కాలినడకన వచ్చి గుండు కొట్టించుకోవాలని మరీ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.

పుట్టుకతో క్రైస్తవుడయిన జగన్ అంత తొందరగా డిక్లరేషన్ ఇస్తారని ఆశించలేం.గతంలో వైఎస్ విజయమ్మ మేము హిందూ దేవాలయాలకు వెళ్లడం కేవలం హిందూ ఓటు బ్యాంక్ కోసమేనని చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.  లడ్డూ వివాదంతో  హిందూ ఓటర్లను దూరం చేసుకున్నామన్న ఆందోళనే జగన్ ను తిరుమల పర్యటనకు పురిగొల్పిందనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు అదే  తిరుమల దేవుడి దర్శనం కోసం  జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించే ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అలా అనుమానాలు వ్యక్తం కావడానికి  కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా  మంత్రులుగా పని చేసిన వారు, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వారు, ఇతర సీనియర్ నాయకులు లడ్డూ వివాదం విషయంలో జగన్ కు మద్దతుగా మాట్లాడేందుకు సాహసించడం లేదు.  వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మాజీ టీటీడీ చైర్మన్లు గా వివరణ ఇచ్చారు గాని పార్టీ నాయకులుగా జగన్ కు మద్దతుగా మాట్లాడడానికి సాహసించడం లేదు.  తగుదునమ్మా అంటూ పొన్నవోలు మీడియా ముందుకు వచ్చి.. జగన్ ను, వైసీపీని ఇంకా డిఫెన్స్ లో పడేశారు.  ఈ పరిస్థితిలో జగన్  డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దేవుడిని దర్శించుకోవడమంటే.. ప్రజలలో తన పరపతిని మరింత దిగజార్చుకోవడమే అవుతుంది.  మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో రచ్చ జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయడం కూడా నిషేధం. మరి ఈ పరిస్థితుల్లో ఏమి జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.