తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.
అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ, చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది. దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది.
సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.
మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు. జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు.
అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-laddu-contravarsy-25-213674.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.