జగన్ హయాంలో తిరుమలలో అధర్మం నాలుగు పాదాలపై.. హుండీ కానుకలనూ వదల్లేదు!!

Publish Date:Jul 29, 2024

Advertisement

జగన్ హయాంలో తరుమల పవిత్రత మంటగలిసింది.  తిరుమల దేవుని సన్నిధిలో పారిశుద్ధం నుంచి ప్రతి విషయంలోనూ పూర్తి నిర్లక్ష్యం తాండవించింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నుంచి కొండపై హోటళ్లలో నాణ్యత కరవైంది. ఇప్పుడిప్పుడే.. అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలు, అధర్మాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ  కానుకలు దొంగతనానికి గురైన సంగతి వెలుగు చూసింది. అలా చోరీ చేసిన సొమ్ముతో   ఆస్తులు కూడబెట్టుకున్న  నేరస్తుడిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్ముక్కైన సంగతి ఇప్పుడు వెలుగు చూసింది.  జగన్ హయాంలో టీటీడీ ఆవోగా  పని చేసిన ఆధర్మాధికారి, ఎస్పీ స్థాయిలో పని చేసిన పోలీస్ అధికారి, సీఐ స్థాయి పోలీస్ అధికారులు శ్రీవారి హుండీ కానుకలను దొంగిలించిన సొత్తు నుంచి వాటా తీసుకున్న ఉదంతం విస్తుగొలుపుతోంది.  

తిరుమలేశుని హుండీ కానుకల చోరీ నేరస్తుడితో ఈవో, పోలీసు అధికారులు కుమ్మక్కై చోరీ సొత్తులో వాటా తీసుకున్న విషయాన్ని  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండలి వేదికగా వెల్లడించారు.   తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసిన విదేశీ కరెన్సీ  కానుకల చోరీకి  పాల్పడిన పెద్ద జీయర్ మఠానికి చెందిన  రవికుమార్ అనే వ్యక్తి పైన, ఈ సంఘటనను పక్కదారి పట్టించిన  అప్పటి ఈవో  ధర్మారెడ్డి , అప్పటి ఎస్పీ, సిఐలపైన,   విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇంతకాలం ఈ సంఘటనను బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు తొక్కి పెట్టారో కూడా అప్పటి పాలకమండలి సమాధానం చెప్పాలని మంత్రి మండలి వేదికగా చెప్పారు.  .

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకల ద్వారా  నిత్యం కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీవారి ఆలయ వ్యవహారాల సాంప్రదాయాలను పర్యవేక్షించే ఆలయ పెద్దగా పెద్ద జీయర్ స్వామి వ్యవహరిస్తుంటారు. ఆయన వద్ద శిష్యరికం చేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి గత రెండు దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణిలో హుండి కానుకలను లెక్కిస్తుంటారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం పెద్ద జీయర్ స్వామీజీ కి చెందిన వారిని ఆలయం లోపలికి వెలుపలికి వచ్చే సమయంలో   తనిఖీ చేయరు అయితే ఓ రోజు అనుకోకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరకామణికి వెళ్లి వస్తున్న రవికుమార్ ను   తనిఖీ చేశారు. దీంతో ఆయన వద్ద   దొంగతనంగా తీసుకెళ్తున్న యూఎస్ డాలర్లు దొరికాయి.

దీంతో  విజిలెన్స్ అధికారులు మొత్తం కూపీ లాగారు.‌  గత 20 ఏళ్లుగా పరకామణిలో కానుకలను లెక్కింపు చేస్తున్న రవికుమార్ ప్రతిరోజు ఇలా మ సీసీ కెమెరాలకు ఒక సైతం దొరకకుండా యూఎస్ డాలర్లు, విదేశీ కరెన్సీ మాత్రమే దొంగతనంగా తీసుకెళ్తుండేవాడని తేల్చారు.  ఇలా విదేశీ కరెన్సీ ని యదేచ్చగా అందరి కళ్ళు కప్పి దొంగతనం చేస్తూ రవికుమార్ దాదాపు 150 కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది.‌  జూలై 2022లో బయటపడిన ఈ అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నొక్కి పెట్టేందుకు అప్పటి ఈవో, ఎస్పీ, తిరుమలలో పనిచేసే ఒక సీఐ రంగంలోకి దిగారు. వ్యవహారం బయటకు పడకుండా కొంతకాలం నొక్కి పెట్టారు. 

శ్రీవారి సొమ్మును నొక్కేసిన నిందితుడు రవికుమార్ వద్దనుండి ఆస్తులను జప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అతనికి శిక్షపడేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా  రవికుమార్ చోరీ సొత్తుతో కూడబెట్టిన ఆస్తులలో కొన్నిటిని   రవికుమార్ విరాళంగా ఇస్తున్నట్లుగా టిటిడి   పేరిట రాయిం చారు. నిందితుడు రవికుమార్ పేరిట ఉన్న మరికొన్ని ఆస్తులను  పోలీస్ అధికారులు తమ బంధువుల పేరిట రాయించుకున్నారు. అప్పట్లో నిందితుడు రవికుమార్ కూడా పోలీసులు తమను విచారణ పేరిట వేధిస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం.  రవి కుమార్ పై తేలికపాటి చిన్న పెట్టీ కేసు పెట్టారు. ఆ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో  పరిష్కరించేశారు. రవికుమార్ కు చెందిన ఆస్తులను టిటిడి పేరిట రాయించుకున్న సందర్భంలో మాత్రం ఆయన ఆస్తులు టీటీడీకి విరాళం ఇస్తున్నట్లుగా పాలకమండలిలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా  ఉంచేశారు.   ఈ సంఘటనపై దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి శాసనమండలిలో ప్రకటన చేశారు. విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.