తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్‌చల్..!

Publish Date:Aug 16, 2026

Advertisement

 

తిరుమల పవిత్రతపై విమర్శలు..!

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా మరొక ఘటన వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి యథేచ్ఛగా సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో భక్తులు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తిరుమల కొండకు కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు 2,600వ మెట్టు సమీపంలో ఒక వ్యక్తి కూర్చొని ధూమపానం చేస్తున్న వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తిరుమల పరిసరాల్లోకి సిగరెట్లు, బీడీలు వంటి నిషేధిత వస్తువులు ఎలా వస్తున్నాయంటూ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది.

ఈ ఘటనపై  టీటీడీ యంత్రాంగాన్ని వైసీపీ తీవ్రస్థాయిలో నిలదీసింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భద్రత మరియు తనిఖీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించింది.

ప్రత్యేకంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుంటూ విపక్షాలు ఘాటు విమర్శలు గుప్పించాయి. తనకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని, ఇదొక్కటే పని కాదని వ్యాఖ్యానించిన వ్యక్తిని దేవస్థానం ఛైర్మన్‌గా నియమించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా అలిపిరి తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత వస్తువులు కొండపైకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టడంలో టీటీడీ  భద్రతా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది.

ఈ రకమైన ఘటనలు ఆధ్యాత్మిక వాతావరణానికి హాని కలిగిస్తాయని, తిరుమల క్షేత్ర మహత్యాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా తనిఖీలను తక్షణమే సమీక్షించాలని డిమాండ్ చేశారు.

తాజా ఘటనపై సాధారణ భక్తుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు కొండపై ప్రతిపాదిత తనిఖీ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని, పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ వివాదంపై టీటీడీ యాజమాన్యం మరియు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, అలాగే అలిపిరి మార్గంలో తనిఖీలను ఎంతవరకూ కట్టుదిట్టం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Tirumala Alipiri, Tirumala Cigarettes Issue, YSRCP on TTD Chairman, Alipiri Footpath Smoke Video, TeluguOne News Tirumala

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.