భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఏం చేయాలి?

Publish Date:Jul 18, 2024

Advertisement

రెండు విభిన్న మనస్తత్వాలు కలిసి జీవితం సాగించడం అంటే అది చాలా క్లిష్టమైన సమస్యే. కానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసి ఇద్దరూ కలసి బ్రతికేలా చేస్తుంది. అయితే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరితో మరొకరు గొడవ పడుతూ ఉంటారు.  అలాంటిది వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య గొడవ రావడం అనేది చాలా సాధారణ విషయం.  గొడవ లేని భార్యాభర్తల బంధం అసలు ఉండదని చెప్పవచ్చు. కానీ గొడవ పడిన ప్రతి భార్యాభర్త విడిపోవడం అనే  ఆప్షన్ వరకు వెళ్లరు.  ఇప్పటి జనరేషన్ లో మాత్రం గొడవలు వర్షాకాలంలో వర్షం కురిసినట్టు ఎడాపెడా జరుగుతూనే ఉంటాయి.  ఇలాంటి వారు విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.  గొడవ జరిగినా సరే.. భార్యాభర్తలు విడిపోని పరిస్థితి రాకూడదు అంటే ఏం చెయ్యాలి?

ఏం చేయాలి?


గొడవ జరిగేటప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది శ్రద్దగా వినాలి. అవతలి వాళ్లు ఫిర్యాదులు చేస్తూ ఉండవచ్చు.  సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కానీ అవతలి వాళ్లు చెప్పేది వినాలి.  వారు చెప్పేది నచ్చకపోతే అప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వగుండా ప్రశాంతంగా రియాక్ట్ అవ్వాలి. మీ వైపు ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. భాగస్వామికి క్షమాపణ చెప్పే విషయంలో ఎప్పుడూ అహం చూపించకూడదు.  ఒకవేళ భాగస్వామి ముందు చెప్పలేనంత కోపం వస్తే ఆ కోపాన్ని బయటకు వ్యక్తం చేయకుండా సింపుల్ గా నెంబర్స్ కౌంట్ చేయాలి. కోపం కంట్రోల్ లోకి వచ్చే వరకు ఇలా నెంబర్స్ కౌంట్ చేయడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది.  కోపం కాస్తో కూస్తూ తగ్గుతుంది.


ఏం చేయకూడదు?


భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కేకలు వేయకూడదు.  అలాగే అరవకూడదు.  గొడవను కూడా ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడుతున్నట్టే పడాలి. అలా చేస్తే మీరు దేనికి బాధపడుతున్నారనే విషయాన్ని అవతలి వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మీ మీద తిరిగి కోపం చేసుకోరు.


భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవల్లో పొరపాటున కూడా ఇరు కుటుంబ సభ్యుల గురించి,  వారి వ్యక్తిగత విషయాల గురించి ఎత్తి చూపి మాట్లాడి విమర్శించకూడదు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఇద్దరి గురించే ఉండాలి.


గొడవ జరిగేటప్పుడు ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడకూడదు. ఇది ఒకరి మీద మరొకరికి ఉండే మంచి అభిప్రాయం పోయేలా చేస్తుంది. కొన్ని సార్లు ఇలా చెడుగా మాట్లాడటం అనేది శాశ్వతంగా బంధం తెగిపోవడానికి కారణం అవుతుంది.


భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయం గురించి గొడవ జరిగి అది పరిష్కారం అయిన తరువాత తిరిగి  అదే విషయం గురించి మళ్లీ గొడవ పడకూడదు.  ఇది ఇద్దరి మధ్య బంధాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది.


మర్యాద ఉండాలి..


భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నట్టే గొడవలు కూడా వస్తాయి.  అయితే భార్యాభర్తలు ఇలా గొడవ పడే విషయంలో కూడా మర్యాద మరచిపోకూడదు. ఇద్దరి మధ్య ఒక  ఒప్పందం ఉండాలి. ఎప్పుడూ మూడవ వ్యక్తి ముందు గొడవ పడకూడదు. గొడవలు జరిగేటప్పుడు ఒకరిని మరొకరు కించపరుచుకోకూడదు. వేళ్లు చూపించి మాట్లాడటం, వెక్కిరించి మాట్లాడటం,  లోపాలను లేవనెత్తడం, చేతకాని వ్యక్తులనే అర్థం వచ్చేలా దూషించడం చేయకూడదు. ఇవన్నీ ముందే కూర్చొని మాట్లాడుకుని ఒప్పందం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే భార్యాభర్తల మధ్య  గొడవలు రావడం కూడా తగ్గుతుంది.  ఒకవేళ వచ్చినా భార్యాభర్తలు కొద్దిసేపటికే మాములుగా మారిపోతారు.


                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.