మీక్కూడా ఆఫీసులో చిరాకు పెరుగుతుందా? ఇలా జరగచ్చు జాగ్రత్త..!

Publish Date:Nov 5, 2025

Advertisement

 

జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది.  జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది.  అయితే ఆఫీసులో ఒత్తిడి,  చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి.  వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి,  చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది.

ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు,  పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు.  ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత,  వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.  

ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం,  వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు.

ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం,  ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం.  దీని వల్ల ఉద్యోగులు పని  చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు.  ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది.

ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు,  ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల పని చేసే వాతావరణం  అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు,  నిరాశ,   ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే..  అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం,  రక్తపోటు సమస్యలు,  మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.

చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి.  అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.  

                                    *రూపశ్రీ

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.