టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.!

Publish Date:Oct 19, 2026

Advertisement

బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంచలన కేసులో ముంబై పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులు సంయుప్తంగా చేసిన గాలింపు చర్యల్లో అత్యంత కీలకమైన పురోగతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో అనుమానాస్పదంగా రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. పట్టుబడిన నిందితులలో ఇద్దరు హరియాణా రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరొకరు బిహార్‌కు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ ముగ్గురు వ్యక్తులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఈ దాడికి సంబంధించిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాల్పులకు పాల్పడింది సాధారణ దుండగులు కాదని, అత్యంత నిపుణులైన ప్రొఫెషనల్ షూటర్లని జాతీయ మీడియా ద్వారా పోలీసులు వెల్లడించారు. నటుడిపై దాడి చేయడానికి ముందు నిందితులు పక్కాగా పథకం రచించారు. టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ముంబైలోని జుహు ఫుట్‌బాల్ మైదానానికి వెళ్లే అలవాటును నిందితులు ముందుగానే గమనించారు. ఆయన కదలికలపై నిఘా పెట్టి సుదీర్ఘంగా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దారుణానికి ప్లాన్ వేసినట్లు దర్యాప్తు వర్గాలు తేల్చాయి. నటుడు తన కారులో అక్కడి నుంచి బయలుదేరే సమయంలో సరిగ్గా అదను చూసి దాడి చేసేందుకు వారు ప్రణాళికలు రూపొందించినట్లు విచారణలో తేలింది.

కాల్పుల అనంతరం నిందితులు పోలీసుల కంట పడకుండా అత్యంత చాకచక్యంగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో తాము ప్రయాణించిన మోటార్ సైకిల్‌ను వదిలిపెట్టి, అక్కడి నుంచి బోరివాలి వైపు వెళ్లే రైలును ఎక్కారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దులను దాటి వేగంగా పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు పోలీసుల సాంకేతిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. అయితే, నిందితుల కదలికలను నిరంతరం ట్రాక్ చేసిన భద్రతా బలగాలు రాజస్థాన్‌లోని కోటా వద్ద వారిని పట్టుకోవడంలో విజయవంతమయ్యాయి. ఈ కేసులో మరింత మందికి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

 

 

 

[ Tiger Shroff, shooting case, arrested, Lawrence Bishnoi gang, Mumbai police, Bollywood news, Rajasthan Police, Bollywood actor murder plot, Kota railway station, Juhu football ground, Telugu One, Telugu News ]


 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.