తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నది వద్ద పులి జాడలు కలకలం సృష్టించాయి. పులి జాడలను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి అడుగుల గుర్తుల వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణ సరిహద్దుల్లో పులి సంచరించిన ఆనవాలు లేకపోయినప్పటికీ.. సరిహద్దుకు అతి సమీపంలో పులి అడుగుజాడలు ఉండటంతో తెలంగాణ అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉండే గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా తాటిపల్లి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ చాటింపు వేయించారు. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇలా ఉండగా వార్దా నది ఒడ్డుల పులిని చూశామని తాటిపల్లి గ్రామస్థులు చెబు తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tiger-roming-recognised-near-varda-river-36-210609.html
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.
క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు.