కారును షెడ్డులో పడేయాలంటున్న కమలనాథులు
Publish Date:May 19, 2012
Advertisement
భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంచి ప్రసంగకర్త, విమర్శకుడు. ఆయనే కనుక మేలికపెడితే ఎలా వుంటుందో ఒక్కసారి రుచి చూసిన వారు జీవితంలో మరువలేరు. అంతటి ఘాటైన విమర్శలు చేసే కిషన్ రెడ్డి ఓ కొత్త మెలిక పెట్టి తెలంగాణా రాష్ట సమితిని ఇరుకున పెట్టారు. "తెలంగాణా కోసమే టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఇక పోటీ నుంచి తప్పుకోవాలి .... ఎందుకంటే తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం తీసుకురావటం టి.ఆర్.ఎస్. కు చేతకాదు. అది తేవాలంటే కేంద్రస్థాయి నుంచి కింది దాకా ఉండే ఒక్క బిజెపికే సాధ్యం. అందుకని తెలంగాణా కోసం మా వెనుకే ఉంటే చాలు. అసలు తెలంగాణా కేసిఆర్ జీవితలక్ష్యమైతే దాన్ని నెరవేర్చుకునేందుకు సహకరించా ల్సిందే. తెలంగాణలో ఒక్క టి.ఆర్.ఎస్. మాత్రమే ఉండదని మహబూబ్ నగర ఎన్నికల్లో మా పార్టీ విజయం నిరూపించింది. ఆ అక్కసుతోనే కేసిఆర్, జెఎసి చైర్మన్ కోదండరామ్ ను పదవి నుంచి తప్పించేందుకు చూస్తున్నారు. అలానే తెలంగాణా రావాలంటే టిడిపి అధినేత చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేయాలి. ఆయనే తెలంగాణా వ్యతిరేకి'' అని కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం తెలంగాణలో సంచలనమైంది. ఈ సంచలన ప్రకటన టి.ఆర్.ఎస్.పై కోపంగా ఉన్న తెలంగాణావాదులను బిజెపి వైపు మళ్ళించవచ్చని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి రెచ్చిపోయి చేసిన ఈ ప్రకటనపై టి.ఆర్.ఎస్. నాయకులు తీవ్రంగా స్పందించారు. మతతత్వ పార్టీ అయిన బిజెపి కు తెలంగాణాను తెచ్చెంత సీన్ లేదని అయితే సమైఖ్యవాదులనుంచి ముడుపులు తీసుకున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణా వాదంలో చీలికకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పరకాల ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్టుకూడా దక్కదని ఎద్దేవా చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/through-car-in-shed-24-14149.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





