కడప 'దేశం'పై కన్నేసిన జగన్
Publish Date:May 19, 2012
Advertisement
గెలుపుకోసం నేనెంత దాకా అయినా తెగిస్తానన్న శ్రీమహాలక్ష్మి సినిమాలోని శ్రీహరి డైలాగు అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సొంతజిల్లా అయినందున కడపలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపుకోసం అడుగడుగు నా వ్యూహం మార్చుకుంటూ పోతున్నారు. ఇప్పటిదాకా ఇతరపార్టీల్లో ఉన్న ద్వితీయ కేడర్ ను ఎలా ఉపయోగించు కోవాలనే అంశంపై దృష్టి పెట్టిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసంతృప్తితో ఉన్న నేతల వివరాలను సేకరించింది. ఈ జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఈ మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నాయకుల జాబితాలను దగ్గర పెట్టుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరితోనూ విడివిడిగా చర్చలు జరుపుతోంది. ముందస్తుగా రైల్వేకోడూరు టిక్కెట్టు ఆశించిన ఎంపి సాయిప్రతాప్ అనుచరుడు, 2004-2009 వరకూ ఎమ్మెల్యే అయిన గంటి వెంకటేశ్వర ప్రసాద్ ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తనకు టిక్కెట్టు ఇవ్వలేదన్న అసంతృప్తితో వున్న ఈయన సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి కలుస్తారని చెప్పినా తనకు ఖాళీ లేదని తప్పించుకున్నారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు సూచించిన కనుపర్తి ఈశ్వరయ్యకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై అసంతృప్తితో గడుపుతున్న వెంకటేశ్వర ప్రసాద్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో జగన్ పర్యటన సందర్భంగా చేరనున్నారు. దీనికి ఏర్పాట్లూ పూర్తియ్యాయి. అలానే ఈయన తరువాత గేలం తెలుగుదేశంపార్టీలోని ఓ ఇద్దరు నేతలకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వేసిందని సమాచారం. వీరి వివరాలు ఇంకా ఆ పార్టీ బయటపెట్టలేదు. ప్రసాద్ చేరికతో తమ పార్టీ రైల్వేకోడూరులో బలపడుతుందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/three-constituencies-of-cuddapah-24-14150.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





