కాషాయ తీర్థం పుచ్చుకున్న టీఎంసీ ఎంపీలు.!
Publish Date:Jul 9, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్ లు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. గురువారం (జులై 9) వీరు అధికారికంగా బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే వీరంతా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి విదితమే. వీరరుముగ్గురూ గురువారం జులై 9) బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది. పార్టీ మారిన ఈ ముగ్గురు నేతల్లో సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీలో సీనియర్ నాయకుడు. 2024 ఆగస్టులో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై అప్పుడే సుఖేందు శేఖర్ రాయ్.. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, పోలీసుల వైఫల్యాలను తప్పుపట్టారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అప్పటి నుంచీ టీఎంసీ హై కమాండ్ ఆయనను పూర్తిగా పక్కనబెట్టింది. ఈ నేపథ్యంలోనే.. సుఖేందు శేఖర్ రాయ్ గత నెల 8న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న సుస్మితా దేవ్, 11న ప్రకాష్ చిక్ బారాయిక్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వారు బీజేపీ గూటికి చేరి టీఎంసీకి, మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు. West Bengal Politics, BJP TMC Shock, Sukhendu Sekhar Ray, Mamata Banerjee, Rajya Sabha By Election Candidates
http://www.teluguone.com/news/content/three-tmc-mps-join-bjp-25-225569.html





