అవి జగన్ ఓట్లు కావు.. షర్మిల

Publish Date:Jul 13, 2024

Advertisement

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన, అవమానకరమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో  151 స్థానాలలో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనా వైభోగాన్ని చూసి ఇక దయచేయండి అని మర్యాద కూడా లేకుండా చెప్పారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఒకే విధమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం, అధికారానికే కాదు, కనీసం విపక్షంగా కూడా ఉండేందుకు వైసీపీని అంగీకరించం అన్నదే. 

ఇంతటి ఘోర ఓటమి తరువాత కూడా వైసీపీ తమకు 39శాతం మంది ప్రజలు మద్దతుగా ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కళ్లు మూసి తెరిచేసరికి ఐదేళ్లూ పూర్తవుతాయి, మళ్లీ మనదే అధికారం అంటే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా జనాలను, తమ పార్టీ నేతలు, క్యాడర్ ను నమ్మించడానికి చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ నుంచి వైదొలగడానికి అవకాశం కోసం చూస్తున్నారు. ఆ విషయాన్ని దాపరింకం లేకుండా బాహాటంగానే చెప్పేస్తున్నారు. అయినా జగన్ మాత్రం 40 శాతం మంది మద్దతు ఉందన్న భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయేలా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అన్న విషయంపైనే జరిగాయనీ, జనం జగన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు.

వైసీపీకి వచ్చిన 39శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీవేననీ, అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అవి వైసీపీకి పడ్డాయనీ వివరించారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు మాత్రమే  జగన్ కు ఓటేశారు తప్ప వాళ్లెవరూ జగన్ ను నమ్మడం లేదనీ, విశ్వసించడం లేదనీ షర్మిల అన్నారు.  ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీకి ఓటేసిన వాళ్లంతా  కాంగ్రెస్  నుంచి అటువైపు వెళ్లిన వాళ్లే. వాళ్లంతా మా వాళ్ళు. మా వాళ్లను మేం రాబట్టు రాబట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ పార్టీకి ఓటేసిన 39శాతం మందీ కాంగ్రెస్ వారేనని ఆమె తెలిపారు. అది మా ఓటు బ్యాంకు. 2029లో ఆ విషయం అందరికీ అర్ధమౌతుందని చెప్పారు.  అంటూ షర్మిల వివరించారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.