వ్యాపారాలు, ఆస్తుల కోసమేనా.. బీఆర్ఎస్ రాగం?

Publish Date:Jan 3, 2023

Advertisement

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులు సోమవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారికి బీఆర్ఎస్ ఏమీ రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పలేదు. బలవంతపు బ్రాహ్మణార్దం అన్నట్లుగా పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ పంపిన కార్లలో వచ్చిన వీరు కేసీఆర్  చేత పార్టీ కండువా కప్పించుకోవడానికి   దాదాపు నాలుగు గంటల పాటు తెలంగాణ భవన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ఔను ఏపీ నుంచి కేసఆర్ పంపిన కార్లలో ర్యాలీగా వచ్చిన వీరు తెలంగాణ భవన్ చేరుకుని బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి నాలుగు గంటల సేపు పడిగాపులు కాసారు. వీరు తెలంగాణ భవన్ చేరుకున్న నాలుగు గంటల తరువాత తీరిగ్గా కేసీఆర్ వచ్చి వీరికి బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పారు. సముచిత స్వాగతం లేకపోయినా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ కుమార్ తదితరులు బీఆర్ఎస్ గూటికి చేరడానికి ఎందుకు తహతహలాడారు? అంటే వారికి హైదరాబాద్ లో ఉన్న బాదరాయణ సంబంధాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలు, ఆస్తుల కారణంగానే ఒక విధంగా అనివార్యంగా వారు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు హైదరాబాద్ లో కనస్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆదిత్య కనస్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్యా హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆదిత్యా ఇన్ఫ్రాటెక్,  డెక్కన్ ఇండియా కార్పొరేషన్ తోట చంద్రశేఖర్ కు చెందినవే. ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నడుపుతున్నాయి. దీంతో ఆయన వీటి పరిరక్షణ విస్తరణ అవసరాల కోసమే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు.

అలాగే టీవీ 99 అనే చానల్ నడుపుతున్న ఈయన ఒక సమయంలో సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇక మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు కూడా వికారా బాద్ లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. ఇలా తమ ఆస్తులు, వ్యాపారాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ గూటికి చేరారని చెబుతున్నారు.  మంత్రిగా ఉన్న సమయంలో రావెల పేషీలో ఒక నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు పీఏలు మారారంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అవగతమౌతుంది. ఇటు తమ ఆస్తుల భద్రత, అటు ఏపీలో ఏదో మేరకు రాజకీయ ప్రాధాన్యత దక్కుతాయన్న ఉద్దేశంతోనే వీరు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపారని అంటున్నారు.

అందుకే వీరి చేరికను బీఆర్ఎస్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. వీరిని అడ్డు పెట్టుకుని ఏపీలో కాలూనవచ్చని భావించిన కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి కొన్ని బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అటు ఏపీలో కూడా వీరు బీఆర్ఎస్ లో చేరడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.  అదీ గాక తోట చంద్రశేఖర్ ఏపీలో ఇప్పటి వరకూ మూడు పార్టీల తరఫున మూడు సార్లు ఎన్నికల బరిలోకి దిగి మూడు సార్లూ పరాజయం పాలయ్యారు. అలాగే రావెల కూడా తెలుగుదేశం హయాంలో మంత్రిగా పని చేసి ఆరోపణలు ఎదుర్కొని ఉద్వాసనకు గురయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి 2019 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ  తరువాత వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో చేరేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బీఆర్ఎస్ గూటికి చేరారు.   

By
en-us Political News

  
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.