షర్మిల ఢిల్లీ టూర్..కారణం ఇదే!

Publish Date:Oct 23, 2022

Advertisement

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మళ్లీ ఢిలీకి వెళ్లారు. అక్టోబర్ 21వ తేదీన ఆమె ఢిల్లీలో కంఫ్ట్రోలర్ ఆండ్ అడిట్ జనరల్ (కాగ్)ను కలిసి.. తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా  అవినీతి జరిగిందని ఆరోపించారు. అందులో సీఎం కేసీఆర్, ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్ మెఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డిలు భారీగా అవినీతి పాల్పడ్డారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని వివిధ సంస్థల నుంచి నిధులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న స్కాం.. రాష్ట్ర స్థాయిలోనిది కాదని.. జాతీయ స్థాయిలోనిదని ఆమె తేల్చి చెప్పారు. 

అయితే ఇదే నెల మొదటి వారంలో వైయస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐ కేంద్ర కార్యాలయంలోని కీలక అధికారులకు ఇదే అంశంపై ఫిర్యాదు చేసి... అనంతరం ఢిల్లీ వేదికగా వైయస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ తర్వాత తెలంగాణలో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడం.. అదీ జస్ట్ పదిరోజుల్లోనే కావడం.... అదీ కూడా ఆమె చేస్తున్న పాదయాత్రకు జస్ట్ స్మాల్ బ్రేక్ ఇచ్చి ఇలా ఢిల్లీ వెళ్లడంపై తెలంగాణ సమాజం ఒక రకమైన సందేహన్ని వ్యక్తం చేస్తోంది. 

మరోవైపు వైయస్ షర్మిల... వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఏడాది పూర్తి చేసుకొంది. ఆ క్రమంలో తెలంగాణ సమస్యలు తెలుసుకోనేందుకు ఆమె పాదయాత్ర సైతం చేపట్టింది. అలాగే ప్రతి మంగళవారం నిష్టగా దీక్షలు కూడా చేపడుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీకి వైయస్ షర్మిల.. ఒకటికి రెండు సార్లు.. ఇలా వెళ్లడం వెనుక పెద్ద మతలబే ఉందనే ఓ చర్చ అయితే.. తెలంగాణ సమాజంలో వాడి వాడిగా.. వేడి వేడిగా సాగుతోంది.   

తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికార పీఠం ఎక్కాలని భావిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి.. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన కోట్లాది రూపాయిలు వెచ్చించి..  సొంత విమానాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే కేసీఆర్‌కు.. ఆర్థికంగా అండ దండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఉన్నారని.. అందుకే వీరిపై ఫిర్యాదు చేసేందుకు వైయస్ షర్మిల.. ఢిల్లీకి పరుగు తీస్తున్నారని తెలంగాణ సమాజంలో ఓ చర్చ అయితే యమా జోరు జోరుగా నడుస్తోంది.  

మరోవైపు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన జలయజ్జం తాలుకా ప్రాజెక్టులనీ ఈ మెగా కృష్ణారెడ్డే దక్కించుకున్నారని.... అయితే వైయస్ఆర్‌ ఆకస్మిక మరణంతో ఆయనకు చెందిన కోట్లాది రూపాయిలు ఈ మెగా సంస్థ అధినేత చేతిలో చిక్కుకు పోయాయని..  ఆ తర్వాత సదరు నగదు రాబట్టుకోవాలని ఆ మహానత తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయన తనయురాలు వైయస్ షర్మిల ఎంతగా ప్రయత్నించినా.. వారి వల్ల కాలేదనే ఓ టాక్ అయితే తెలంగాణ సమాజంలో కొన.... సాగుతోంది.  

ఆ క్రమంలోనే ఆస్తినగదు పంపకాల అంశంలో విజయమ్మ బిడ్డల నడుమ... పులివెందుల సాక్షిగా గట్టిగానే సిగపట్లు పట్టుకోన్నారని ఓ చర్చ సైతం నాడు మీడియాలో బాగానే నడిచిందని సమాచారం. ఆ క్రమంలోనే మెగా సంస్థ నుంచి నగదు రాబట్టు కోవడం కోసం.. రివర్స్ టెండరింగ్ అంటూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మెగా కృష్ణారెడ్డి చేతికి సీఎం జగన్ ఇచ్చారని చర్చ తెలంగాణ సమాజంలోనే కాదు... ఫ్యాన్ పార్టీలోని కీలక నేతల్లో సైతం నేటికి హాట్ టాపిక్‌గానే ఉందని తెలుస్తోంది. వైయస్ జగన్.. ఆ విధంగా మెగా అధినేత నుంచి నగదు రాబట్టుకుంటే.. తన పరిస్థితి ఏమిటనే ఆందోళనతో వైయస్ షర్మిల ఢిల్లీకి దౌడు తీస్తుందనే టాక్ సైతం తెలంగాణలో సాగుతోంది. 

ఇంకోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. వివిధ వేదికలపై నుంచే కాకుండా వారు చేపట్టిన పాదయాత్రల్లో సైతం భారీగా ఆరోపణలు సంధిస్తున్నారు. కానీ వీరిద్దరు ఏనాడు ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్ అవినితీపై సీబీఐకి కానీ,డీకి కానీ,జలశక్తి శాఖ కానీ, కాగ్‌కు కానీ ఫిర్యాదు చేసింది లేదని తెలంగాణ సమాజం ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటోంది. కానీ వైయస్ షర్మిల మాత్రం.. కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసిన జస్ట్ 24గంటలకే ఢిల్లీకి వెళ్లి.. కేసీఆర్,మెగా కృష్ణారెడ్డి అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిందని.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. కాగ్‌కు ఫిర్యాదు చేసిందని తెలంగాణ సమాజం స్పష్టంగా పేర్కొంటోంది. మెగా కృష్ణారెడ్డి వద్ద ఉన్న సొమ్ము తమదైతే.. సోకు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ చేసుకుంటున్నారనే భావనతో వైయస్ షర్మిల..  ఢిల్లీకి టూర్ కట్టేస్తోందనే ఓ రసవత్తరమైన చర్చ అయితే తెలంగాణ సమాజంలో రంజు రంజుగా సాగుతోంది. మరోవైపు.. వైయస్ షర్మిల ఢీల్లీలోని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సీబీఐని రాష్ట్రాల న్యాయ పరిధిలోని రాకుండా చేస్తున్నాయి. అదే కాగ్ అయితే.. కేంద్రంలో అయినా.. రాష్ట్రాల్లో అయినా ఆడిట్ చేయవచ్చునని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయకున్నా.. కాగ్ అయినా చేస్తుందనే ఓ చిన్న ఆశ.. వైయస్ షర్మిలలో ఉందనే ఓ చర్చ సైతం లోటస్ పాండ్‌లోని వినిపిస్తోంది. మరి కాళేశ్వరంలో మింగిన కోట్లాది రూపాయిలను సీఎం కేసీఆర్, మెఘా కృష్ణారెడ్డిలను నుంచి వైయస్ షర్మిల కక్కిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలని తెలంగాణ సమాజం పేర్కొంటోంది.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.