ఇదీ దేవుడి స్క్రిప్టేగా జగన్

Publish Date:Feb 25, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నోట తరచుగా వచ్చే మాట దేవుడి స్క్రిప్ట్. ఈ పదాన్ని ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ విజయం నుంచీ మొదలు పెట్టారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ.. సమయం, సందర్భం లేకున్నా దేవుడి స్క్రిప్ట్ గొప్పగా ఉందంటూ వ్యాఖ్యలు చేసే వారు. 

2024 ఎన్నికలలో అదే దేవుడు వైసీపీకి అంత కంటే గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయాన్ని అందించి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నాడు. గతంలో జగన్ ప్రతి విషయాన్ని 23 నంబర్ తో ముడిపెట్టి తెలుగుదేశంపై సెటైర్లు గుప్పించేవారు. ఇప్పుడు అదే పని తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నాయి.  పదకొండు నంబర్ ను ప్రస్తావిస్తూ తెలుగుదేశం శ్రేణులు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాయి. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 24) జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో వాస్తవానికి వైసీపీ పార్టీకి బ్లాక్ 12 కేటాయించారు. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా సైనికులు సృజన జోడించి బ్లాక్ 12ను బ్లాక్ 11గా మార్చి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. 

వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ శపథం చేసిన జగన్.. ఆ ప్రతిజ్ణను పక్కన పెట్టి.. తనపైనా, తన పార్టీ ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందన్న భయంతో అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టీ పెట్టడంతోనే విపక్ష హోదా ఇవ్వాలంటూ పోడియం ముందు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. సరిగ్గా 11 నిముషాల తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక్కడా 11 నంబర్ ను గుర్తు చేస్తూ తెలుగుదేశం జగన్ ను ఎగతాళి చేసింది. అయితే సభా నియమాలు, నిబంధనలపై ఇసుమంతైనా అవగాహన లేని జగన్ కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాని సభలో అటెండెన్స్ వేయించుకున్నట్లు కాదన్న విషయం తెలియలేదు. దీంతో ఆయన అసెంబ్లీ హాజరు వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదన్నట్లుగా తయారైంది.  సరే గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడింది.

అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అదే 11 సంఖ్యలు ప్రస్తావిస్తూ జగన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు.  సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేననీ, ఆ ప్రజలు జగన్ కు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి ఆ హోదాకు జగన్ అనర్హుడని తేల్చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలోనైనా జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఆ పార్టీ జనసేనకు ఇప్పుడు ఉన్న స్థానాల కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువ గెలుచుకోవలసి ఉంటుందని గుర్తు చేశారు. అలా కాకుండా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టాలంటే ఇండియాలో కాదు, జర్మనీ వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు.  మొత్తం మీద 11 సీట్ల స్క్రిప్ట్ తో దేవుడు జగన్ కు భలే ఇబ్బందులు తెచ్చిపెట్టాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.