వివాహం తర్వాత మగవాళ్లు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట..!
Publish Date:May 13, 2025
Advertisement
వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి. తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు, సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి. *రూపశ్రీ.
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ. వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/things-guys-shouldnt-do-after-marrying-35-197975.html





